`థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ` అంటూ.. సినిమాల్లో ఫేమస్ అయిన.. కమెడియన్.. పృథ్వీరాజ్.. ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన ఆయన.. తర్వాత.. ఇటు రాజకీయా లు.. అటు సినిమాల్లోనూ రెండింటిలోనూ.. ఫేడ్ అవుట్ అయ్యానంటూ.. ఇటీవల.. ఆవేదన వ్యక్తం చేశారు. కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించిన పృథ్వీ.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నా రు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసాడు.
అందుకు ప్రతిఫలంగా సీఎం జగన్.. పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ)కు చైర్మన్ చేశారు. అయితే..స్వల్ప కాలంలోనే పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇటు వైసీపీలోను.. అటు సినీ ఇండస్ట్రీలోనూ.. పృథ్వీ ఇప్పుడు కష్టాలు చవిచూస్తున్నాడని.. ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
స్వతహాగా మంచి నటుడిగా పేరున్న పృథ్వీరాజ్ తనదైన నటనతో ఆహార్యంతో ఎస్వీబీసీ కోసం ప్రత్యేక ప్రోమోలను తనపై రూపొందించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీలో తన పేరు మార్మోగాలని అనుకున్న పృథ్వీ.. మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ బడా హీరోలపై రాజకీయ విమర్శలు చేశారు. దానికి తగ్గట్టు రాజకీయాల్లో ఈయన హీరోలపై చేసిన దూషణలతో ఈయనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
అయితే.. తన వెనుక జగన్ ఉన్నాడని.. భావించిన పృథ్వీ.. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అయితే.. ఇప్పుటు వైసీపీ పరంగా ఆయన ఒంటరయ్యారు. తాజాగా ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే.. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చించేసి నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారు. అలాగే తన మీద బట్ట కాల్చి వేసినట్టు తనపై లేనిపోని అభాండాలు వేసి వదిలేసారన్నారు. తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కాస్త ఆవేశంగా చెప్పుకొచ్చాడు.
రాజకీయాల కారణంగా తనకు సినిమా రంగంలో అవకాశాలు తగ్గాయని పృథ్వీ చెప్పారు. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ``నా లాంటి ముక్కుసూటి మనిషికి రాజకీయాలు పడవనే విషయం అర్ధమైంది. నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి వస్తే.. అంతా ఆ శ్రీవారి కృప అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా వెనకాల గోతులు తీస్తారని అసలు ఊహించలేదు`` అన్నారు. రాజకీయాల కారణంగా అందరూ బాగానే ఉన్నా.. నేను మాత్రం రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా ఇన్‌డైరెక్ట్‌గా సీఎం జగన్‌పై పృథ్వీ.. కామెంట్లు సంధించారు. ``ఎవరో చెప్పారని నేను పవన్ కళ్యాణ్‌ను ఫాలో కావడం లేదు. ఆత్మ గౌరవానికి, అహంకారానికీ మధ్య జరిగిన పోరాటం అన్నారు. నేను దాన్ని ఫాలో అవుతాను. నేను రాజకీయాల్లో భాగంగా చిరంజీవిని తిట్టినా.. ఆయన దయ తలిచి తాను హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో అవకాశం ఇచ్చిన మంచి మనిషి అని మరోసారి నిరూపించుకున్నారు`` అని పృథ్వీ వ్యాఖ్యానించారు.
``చరిత్రలో జరిగిన వెన్నుపోట్లు గురించి ఎన్నో చూశాను, విన్నాను. కానీ నాకు జరిగిన వెన్నుపోట్లు మరిచి పోలేను` అని అన్నారు. 2020లో కరోనా సోకినపుడు తాను బతుకుతానో లేదో అన్న టైమ్‌లో సినీ పరిశ్రమ తనకు ఎంతో చేయూత నిచ్చిందన్నారు. సాయి కుమార్, జీవితా రాజశేఖర్ వంటి వారు తనకు అండగా నిలబడిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
``నా లాంటి వాళ్లకు అసలు రాజకీయాలే పడవు. వెనకాల కొండను చూసుకొని.. అండ చూసుకొని రెచ్చిపోయాను`` అని అన్నారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాను. దీంతో ఫుట్‌బాల్ లా ఎక్కడో పోయిపడ్డాను. త్వరలో చిరంజీవితో పాటు అశ్వనీదత్ వంటి పెద్ద నిర్మాతలను కలిసి నా తప్పును క్షమించమని కోరుతానన్నారు. మార్పు కోసం నేను ఒక అడుగు వేస్తే మీరు వంద అడుగులు ముందుండి నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించాడు.