టాలీవుడ్ యువ హీరో సామ్రాట్ రెడ్డిపై ఆయన భార్య హర్షితా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్ లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. తనను కొంతకాలంగా సామ్రాట్ వేధిస్తున్నాడని - ఇప్పటికే అతడిపై గృహహింస - వరకట్నం వేధింపుల కేసులున్నాయని - తాజాగా తన ఇంట్లో దొంగతనానికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తామిద్దరూ విడిగా ఉంటున్నామని - మాదాపూర్ లోని తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాడని - ఆభరణాలు - విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడని ఆమె ఫిర్యాదులో పేర్కొఇంది. హర్షిత ఫిర్యాదు ప్రకారం సామ్రాట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సామ్రాట్ ఖండించాడు. ఆ ఆరోపణలు అవాస్తవమన్నాడు. ఆ ఇంట్లో నుంచి తనకు కావల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నానని చెప్పాడు. అయితే, అక్కడి సీసీ కెమెరాలను తానే ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు.
అయితే, కావాలని తాను అలా చేయలేదని. క్షణికావేశలో కోపంతోనే అలా చేశానని, అది తప్పేనని అంగీకరించాడు. తన భార్య,ఆమె తల్లిదండ్రులు ఆరోసిస్తున్నట్లు తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నాడు. తాను డ్రగ్స్ తీసుకోలేదని - తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పాడు. సినీరంగానికి చెందిన సామ్రాట్ కు పరిచయాలు ఎక్కువని - సామ్రాట్ ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానపడేదని సామ్రాట్ తల్లి తెలిపారు. సామ్రాట్ సినిమాల్లో నటించడం హర్షితకు ఇష్టం లేదన్నారు. ప్రతి చిన్న విషయానికి హర్షిత గొడవపడేదన్నారు. రెండేళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లయిందని, 3 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయన్నారు.
సామ్రాట్ కు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయని - డ్రగ్స్ తీసుకున్నాడని హర్షిత ఆరోపించారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. అవి వదులుకోవాలని చెప్పినా వినకుండా తనను వదిలించుకోవాలని చూస్తూ...తనపై దాడి చేశాడని ఆరోపించారు. తన ఇంట్లో వస్తువులు కూడా ఎత్తుకెళ్లాడన్నారు. తనతో కలిసి ఉండే ఉద్దేశం లేదని, కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. పెళ్లికి ముందు అబద్ధాలు చెప్పారని, సినిమాలు మానేసి బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని మధ్యవర్తి చెప్పాడని హర్షిత తండ్రి ఆరోపించారు. సామ్రాట్ గే అని, తన కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్తులు తనపేరు మీద రాయాలని హర్షితను కొట్టేవాడని ఆరోపించారు. ఆమెను తలదిండుతో చంపాలని చూశాడని చెప్పారు.