తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీదా.. పార్టీ నేతల మీద తీవ్రసంతృప్తిలో ఉన్న సీనియర్ సినీనటి కవిత పార్టీ మారారు. గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఆమె.. తాజాగా బీజేపీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కమలం కండువా కప్పుకున్నారు.
గతంలో టీడీపీలో చురుగ్గా పాల్గొన్న కవిత.. గడిచిన కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. తనను అవమానించి. పార్టీ నుంచి గెంటేశారంటూ మండిపడ్డారు. తాను బాధతోనే టీడీపీనుంచి బయటకు వచ్చినట్లుగా చెప్పారు.
1983 నుంచి టీడీపీ కోసం తాను కష్టపడి సేవలు అందించానని చెప్పారు. ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు నచ్చటంతో తాను బీజేపీలో చేరినట్లుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తాను బయటకు రాలేదని.. తనను గెంటేశారని చెప్పిన ఆమె.. టీడీపీ కోసం తానెంతో కష్టపడినట్లుగా చెప్పారు.
పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చంద్రబాబు పదే పదే చెబుతారని.. ఆయన మాటలు తాను నమ్మినట్లుగా కవిత చెప్పారు.కానీ.. అలాంటిదేమీ జరగలేదన్నారు. బాబు మోసకారి అని చాలామంది చెబితే నమ్మలేదని.. కానీ తనకిప్పుడు అర్థమైందన్నారు.
ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో పార్టీలో చేరానని.. ఆయన ఇచ్చిన హామీని బాబు తుంగలోకి తొక్కారన్నారు. చంద్రబాబు చేసిన ప్రతి పోరాటంలోనూ తాను పాల్గొన్నప్పటికి తనను అవమానించారన్నారు. మరింత అవమానం ఎందుకు జరిగింది? ఎందుకన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఇంతకాలం ఉన్నారన్నది కవిత వివరంగా చెబితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.