ఏమాటకామాట చెప్పుకోవాలంటే సోషల్ మీడియా వచ్చాక చాలా విషయాలు అధికారులకు - మంత్రులకు - మీడియాకు నేరుగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ప్రశ్నించే సౌలభ్యం - ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకున్నారు. వారిలో ఒక హీరోయిన్ కూడా తాజాగా చేరారు. అయితే ఆమెకు కలిగిన అసౌకర్యం - ఇబ్బంది ఏమిటంటే... రైలులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగును ఒక ఎలుక కొరికేయడం!
ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్.. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్ ప్రెస్ లో ఏసీ బోగీలో ప్రయాణించారట. ఆ సమయంలో తన హ్యాండ్ బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయి - లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసిందట. వెంటనే రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఆ బ్యాగ్ ఫోటోతో సహా ఫిర్యాదు చేసిన నివేదిత - రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో రైలు ప్రయాణంలో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా రైలు ప్రయాణం చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెబుతూ, ఎలుక కొరికిన బ్యాగు ఫొటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది నివేదిత. అయితే.. ఈ విషయంపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ స్పందించారు. ఎలుకలను పెస్ట్ కంట్రోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టుకుంటారని, నివేదిత ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చెబుతామని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/