కన్నడ నటి కమ్ మాజీ ఎంపీగా సుపరిచితురాలు రమ్య గురించి తెలిసిందే. సినీ నటిగా సక్సెస్ ఫుల్ గా ఆమె కెరీర్ సాగుతున్న వేళ.. మాండ్య ఎంపీస్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటమే కాదు.. అనూహ్యంగా విజయం సాధించిన ఆమె అనతి కాలంలో కాంగ్రెస్ లో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఆమె డీల్ చేసేవారు. సోషల్ మీడియాకు సంబంధించి పార్టీకి సంబంధించి కీ రోల్ ప్లే చేసిన ఆమె.. రాహుల్ గాంధీ టీంలో ముఖ్యురాలిగా మారారు.
అలాంటి ఆమె ఆ తర్వాత ఒక్కసారిగా పార్టీలో కనుమరుగు అయ్యారు. ఎందుకిలా? అసలేం జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె షాకింగ్ వ్యాఖ్య చేశారు. ‘రాహుల్ గాంధీ విషయంలో చేసిన ఒకే ఒక తప్పు వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యా’ అని పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జిగా వ్యవహరించిన ఆమె.. తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ లో కీలకమయ్యారు. ఇంతకీ రాహుల్ విషయంలో రమ్య చేసిన తప్పేంటి? అన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. టెన్షన్ పెట్టి చంపే కంటే.. ఆ తప్పేమిటో చెప్పేస్తే సరిపోతుంది కదా?