ఆంధ్రప్రదేశ్ లో చదువులు చక్కబడుతున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే రోజులు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ తో మార్చిలో మూతబడిన స్కూళ్లు వైరస్ ఉధృతితో తెరుస్తారో లేదోనన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది.
విద్యార్థులంతా చదవులపై రందీ పెట్టుకున్న వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో కరోనా ప్రస్తుతం కల్లోలంగా ఉంది. రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా ఏపీలో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేయడం విశేషం.
సెప్టెంబర్ 5న స్కూళ్లను తెరుస్తామని విద్యాశాఖ మంత్రి సురేష్ తాజాగా ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15వ తేదీన కాలేజీలను పున: ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
స్కూళ్ల ప్రారంభానికి ముందే టీచర్ల బదిలీలు ఉంటాయన్న ఆయన.. స్కూళ్లు ప్రారంభమైన రోజే 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ అందిస్తామని పేర్కొన్నారు.