విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అధినాయకత్వం చెప్పింది తూచా తప్పకుండా చేసుకుంటూ పోయే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలో మరో కోణం బయటకు రానుందా? ఇప్పటికే ఆయనపై ఎన్నో ఊహాగానాలు వినిపించినప్పటికీ.. వాటన్నింటికి భిన్నంగా తన ట్రేడ్ మార్క్ అయిన విధేయతను ప్రదర్శించిన ఆయన తాజాగా ఎవరూ ఊహించని స్టెప్ వేయటానికి సిద్ధం కానున్నారా? అన్నప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చిన్నమ్మపై పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తంచేయటమే కాదు.. తిరుగుబాటు చేద్దామంటూ పన్నీరు వద్దకు పయనమైనట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా తన పాలనా తీరుపై తమిళ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. తాను సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఉద్దేశంతో సీఎం పదవికి రాజీనామా చేయించిన శశికళపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తించిన పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరు వద్దకు వెళుతున్నారు. ఇష్టం లేకున్నా.. బలవంతంగా పదవి నుంచి రాజీనామా చేయించిన పన్నీర్ కు అండగా నిలుస్తామంటూ దాదాపు 31 మంది ఎమ్మెల్యేలు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మరింది.
ప్రజల్లో మద్దతు లేకపోవటం.. చిన్నమ్మ అంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతోపాటు.. అమ్మ మరణంపై నెలకొన్న అనుమానాలు ఒకపక్క.. వీటన్నింటికి చిన్నమ్మే కారణమని నమ్మే వారి సంఖ్య భారీగా ఉన్నారు. ఈ విషయం గడిచినకొద్ది రోజులుగా గమనిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పలువురు.. తాజాగా పన్నీరు సెల్వం చెంతకు చేరి.. పార్టీపై తిరుగుబాటు చేయాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
పన్నీరు బ్యాచ్ చేస్తున్న ప్రయత్నాల్ని గుర్తించిన చిన్నమ్మ వర్గం అలెర్ట్ అయి.. పన్నీరుతో రాయబారానికి పంపినట్లుగా చెబుతున్నారు.చిన్నమ్మ ముఖ్యమంత్రి అయితే.. పన్నీర్ కు కీలకమైన శాఖలు అప్పజెబుతామని.. చిన్నమ్మకు విధేయుడిగా ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది. పన్నీరుసెల్వంకు ఇప్పటికే స్వర్గీయ ఎంజీఆర్ బంధువులు మద్దతు ఇవ్వటం.. దీనికి తోడు అన్నట్లు అన్నాడీంకేకు చెందిన 31 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాన ప్రతిపక్షం సైతం చిన్నమ్మను వ్యతిరేకిస్తున్నారే కానీ.. పన్నీరు సెల్వంకు సీఎం పదవిని ఇవ్వటాన్ని తప్పు పట్టటం లేదు. తనకు అన్నివైపుల నుంచి సానుకూలతలు వ్యక్తమవుతున్న వేళ.. పన్నీర్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/