సినిమా ఆఫర్లు అంటూ టీనేజీ అమ్మాయిలకు.. యువతులకు వలవేసి అటుపై వ్యభిచార దందా సాగిస్తున్న నెల్లూరు వాసి జాకీర్ హుస్సేన్ అలియాస్ మహేష్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన వెనక మీడియా ప్రతినిధి ప్రియాంక.. బడా బాబుల భోగోతంపై ప్రస్తుతం హోం మంత్రి విచారణకు ఆదేశించారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా తవ్వుతున్న కొద్దీ డొంకంతా కదులుతోంది. ఇందులో ధనస్వాముల.. బడాబాబులు ఎందరో ఉన్నారన్న సమాచారం వేడెక్కిస్తోంది. లోతుగా కదిలిస్తే... పశ్చిమబెంగాల్, తెలంగాణ, బెంగళూరు, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి యాంకర్లు సహా పలువురు టీనేజీ అమ్మాయిలు మోసపోయారని తెలుస్తోంది. భయపెట్టి బెదిరించి లోబరుచుకుని ఏదోలా మగువల్ని వంచించారు. అటుపై రహస్య కెమెరాల్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడమే గాక వ్యభిచారం చేయించారు. బెంగళూరు- చెన్నై- పశ్చిమబెంగాల్- తెలంగాణ తదితర ప్రాంతాలకు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ప్రాంతాల్లో అమ్మాయిలు కావాలంటే క్షణాల్లో సమకూర్చేవారు.
ఇక సదరు జాకీర్ అలియాస్ మహేష్ పై కేసులు ఉన్నాయి. ఆయన పోలీసులకు పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. పదే పదే పట్టుబడుతూనే ఉన్నాడు. అయినా పోలీసులకు ముడుపులు చెల్లించి లేదా పెద్దన్నల అండదండలతో బయటపడుతూనే ఉన్నాడు. అయ్యవారి అరాచకాలు తెలిసీ బడా పోలీస్ అధికారులే భయపడేవారట. ఒక రకంగా ఇదో పెద్ద ఛైన్ మాఫియా వ్యవహారంలా సాగడం ఇటు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలతోనూ వ్యభిచార లింకులు బయటపడడంతో ఇప్పుడు పెద్ద గడబిడ అవుతోంది. దీంతో నేరుగా హోంమంత్రిగారే ఇన్వాల్వ్ అయ్యి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపిస్తున్నారని తెలుస్తోంది.