ఆఫ్ఘన్ vs అమెరికా : ఆ 5 కంపెనీలకి వేల కోట్లు లాభం

Update: 2021-09-28 15:30 GMT
అఫ్గానిస్తాన్‌ లో అమెరికా సుదీర్ఘ కాలం పోరాడి , ఆగస్టు 30న చివరి అమెరికా సైనికుడు కాబుల్ నుంచి వెళ్లిపోవడంతో ఈ పోరాటం ముగిసింది. బ్రౌన్ యూనివర్సిటీ 'కాస్ట్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం... ఈ యుద్ధం వల్ల అమెరికా ధనాగారంపై 230 కోట్ల డాలర్ల (సుమారు రూ.17 వేల కోట్లు) భారం పడింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత ,  తాలిబాన్లు శక్తిమంతం కావడం, ఆఫ్గాన్‌ పై పట్టు సాధించడం, అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడం వంటివన్నీ అమెరికా ఓటమిగా చాలామంది నిపుణులు వర్ణించారు.

కొంతమందికి ఇదో ఓడిపోయిన యుద్ధం కావచ్చు. కానీ చాలామందికి ఇదో లాభాదాయక ఒప్పందం. ఈ యుద్ధం కోసం 2001-2021 మధ్య కాలంలో 230 కోట్ల డాలర్లు (సుమారు రూ.17 వేల కోట్లు) ఖర్చు చేశారు. ఇందులో సుమారు 105 కోట్ల డాలర్ల (రూ. 7,754. 74 కోట్లు) ను అఫ్గానిస్తాన్‌ లో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు పూర్తి చేయడానికి వినియోగించారు. ఇందులో అధిక మొత్తాన్ని అఫ్గానిస్తాన్‌ లో అమెరికా ఆపరేషన్స్‌ కు మద్దతుగా నిలిచిన ప్రైవేట్ కంపెనీల సర్వీస్ కోసమే ఖర్చు చేశారు.

అఫ్గానిస్తాన్‌ లో అన్ని రకాల సర్వీసుల కోసం అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన 100కు పైగా కంపెనీలతో యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందులో కొన్ని కంపెనీలు వందల కోట్ల డాలర్లు అందుకున్నాయి. 20 ఇయర్స్ ఆఫ్ వార్, ప్రాజెక్టు డైరెక్టర్‌, ప్రొఫెసర్ హైడీ పెల్టియర్ కూడా 'కాస్ట్ ఆఫ్ వార్' ప్రాజెక్టులో భాగమే. ఈ ఒప్పందాల ద్వారా ఏయే కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయో చెప్పేందుకు అధికారిక డేటా లేదని  హైడీ చెప్పారు.  అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్‌ సైట్ ఆధారంగా ఈ ప్రాజెక్టు వివరాలను తయారు చేశారు. ఈ డేటా, అమెరికా ప్రభుత్వ ఖర్చుల్ని అధికారికంగా తెలుపుతుంది. దీన్ని 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత తయారు చేశారు.

2008-2021 కాలానికి ఈ గణాంకాలు అందజేశారు. కొన్ని ప్రాజెక్టులు 2008 కన్నా ముందే ఉన్నాయి. కాబట్టి మనం 2001 నాటి గణాంకాలను పరిశీలిస్తే, వాస్తవ లెక్కలు మరింత ఎక్కువగా ఉండొచ్చు అని హైడీ అన్నారు. ఈ అంచనాల ప్రకారం, అఫ్గానిస్తాన్‌ లో ముగ్గురు అమెరికా కాంట్రాక్టర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వారు డైన్‌కార్ప్, ఫ్లూయర్, కెల్లాగ్ బ్రౌన్ అండ్ రూట్ . లాజిస్టిక్స్ ఇంక్రీజ్ ప్రోగ్రామ్ విత్ సివిలియన్ పర్సనల్స్' లో భాగంగా ఈ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. అఫ్గానిస్తాన్ పోలీస్‌ లతో పాటు మాదక ద్రవ్య నిరోధక బలగాలకు శిక్షణతో పాటు పరికరాలను అందజేయడం డైన్‌ కార్ప్ నిర్వహించే అనేక విధుల్లో ఒకటి. అఫ్గాన్ అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ఉన్న సమయంలో ఆయనకు బాడీగార్డులను కూడా ఈ కంపెనీయే నియమించింది.

ఫ్లూయర్ టెక్సాస్‌ కు చెందిన కంపెనీ. ఇది దక్షిణ అఫ్గానిస్తాన్‌ లో అమెరికా మిలిటరీ స్థావరాల నిర్మాణాన్ని పర్యవేక్షించింది. ఆ కంపెనీ వెబ్‌ సైట్‌ లో ఉన్న సమాచారం ప్రకారం, ఇది అఫ్గానిస్తాన్‌ లో మరో 76 పార్వర్డ్ ఆపరేటింగ్ బేస్  లను నిర్వహించింది. లక్ష మంది సైనికులకు సహాయంగా నిలిచింది. రోజుకు లక్షా 91వేల మందికి పైగా సైనికులకు ఆహారాన్ని అందించింది. ఫ్లూయర్ కార్పొరేషన్ 13.5 బిలియన్ డాలర్ల (రూ. 99,632 కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హైడీ చెప్పారు. ఇందులో 12.6 బిలియన్ డాలర్లు (రూ. 93,000 కోట్లు) లాగ్‌ క్యాప్స్ ద్వారా అందాయి

అమెరికా బలగాలకు సహాయకంగా ఇంజనీరింగ్, లాజిస్టికల్ అంశాలను కెల్లాగ్ బ్రౌన్ రూట్ (కేబీఆర్) కంపెనీ పర్యవేక్షించింది. సైనిక బలగాలకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయడం, ఆహారం అందించడం, ఇతర కనీస అవసరాలను చూసుకోవడం లాంటి పనులు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరిగాయి. నాటో విమానదాడుల కోసం ఈ కంపెనీ అఫ్గానిస్తాన్‌ లోని చాలా విమానాశ్రయాలకు గ్రౌండ్ లెవల్ సపోర్ట్‌ను అందించింది. రన్‌ వేల నిర్వహణ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఏరోనాటికల్ కమ్యూనికేషన్స్ వంటి అంశాల్లో సహాయపడింది.హైడీ అంచనా ప్రకారం కేబీఆర్ కంపెనీ, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖతో 3.6 బిలియన్ డాలర్ల (రూ. 26, 569 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది.

అత్యధిక మొత్తంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న నాలుగో కంపెనీ రేథియాన్.అమెరికాలోని అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలలో ఇది ఒకటి. అఫ్గానిస్తాన్‌ లో సర్వీస్‌ల కోసం ఈ కంపెనీ 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18, 453 కోట్లు) ఒప్పందం చేసుకుంది.

అఫ్గానిస్తాన్ వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడం కోసం ఇది 14 కోట్ల డాలర్ల (రూ. 1,033 కోట్లు)కు 2020లో తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది.

వర్జీనియాకు చెందిన ఏజీస్ ఎల్‌ ఎల్‌ సీ అనేది సెక్యూరిటీ-ఇంటెలిజెన్స్ కంపెనీ. అఫ్గానిస్తాన్‌ లో సర్వీసులు అందించేందుకు అత్యధిక మొత్తం తీసుకున్న ఐదో కంపెనీ ఇది. 1.2 బిలియన్ డాలర్ల (రూ. 8,857 కోట్లు) ఒప్పందం చేసుకుంది. కాబుల్‌ లోని అమెరికా రాయబార కార్యాలయానికి ఇది భద్రతను అందించింది. అఫ్గానిస్తాన్‌ లో ఏజీస్ కంపెనీ కార్యకలాపాల గురించి చెప్పాల్సిందిగా బీబీసీ ముండో ఆ కంపెనీ యాజమాన్యాన్ని కోరింది. కానీ వారు ఈ అంశంపై స్పందించలేదు.
Tags:    

Similar News