30 ఏళ్ల తర్వా ముంబయిలో అవన్నీ మునిగిపోతాయట

Update: 2021-08-29 16:30 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబయికి సంబంధించి షాకింగ్ నిజాన్ని వెల్లడించారు ఆ మహానగర కమిషనర్. అయితే.. దీనికి కండిషన్లు అప్లై అవుతాయని చెప్పాలి. మరో ముప్ఫై ఏళ్లలో చోటు చేసుకునే వాతావరణ మార్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే ముంబయిలోని కీలకప్రాంతాలన్నీ సముద్రంలో కలిసిపోతాయన్నారు.

మునిగిపోయే జాబితాలో రాష్ట్ర సచివాలయం ..వ్యాపార కేంద్రమైన నారిమన్ పాయింట్ తోపాటు ముంబయిలోని కీలక ప్రాంతాల్లోని 80 శాతం సముద్రుడు ఆక్రమించేస్తారని హెచ్చరించారు. వాతావరణ మార్పులు కారణంగా సముద్ర మట్టాలు పెరిగితే ఎదురయ్యే ఇబ్బందులు ఎంతలా ఉంటాయో చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి వాతావరణ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిన నగర కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్.. కాలుష్య తీవ్రతను తగ్గించే చర్యల్ని చేపట్టాలన్నారు. లేకుంటే.. భారీ వర్షాల కారణంగా దారుణ పరిస్థితులు తప్పవన్నారు.

ముంబయిలోని ఏ..బీ..సీ..డీ వార్డులు నీట మునిగిపోవటం ఖాయమని.. తుఫాన్లు వచ్చినప్పుడు.. భారీ వర్షాలు కురిసినప్పుడువాతావరణంలో మార్పులకు సంకేతాలుగా అభివర్ణించారు. మరో పాతిక.. ముప్ఫై ఏళ్లు అంటే పెద్ద సమయం ఏమీ కాదని.. ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్ని వర్గీకరించి.. అందుకుఅనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఆయన మాటలు ముంబయికి పొంచి ఉన్న ముప్పు ఎంతన్న విషయాన్ని చెప్పేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News