ఒకవైపు సంచలన నిర్ణయాలు.. రకరకాల వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సీఏఏ విషయానికే వస్తే పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఢిల్లీలో అల్లర్లను పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇక ఆర్టికల్ 370 రద్దు అంశం గురించి కోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి రచ్చలు కొనసాగుతూ ఉండగానే.. మరో అంశం మీద మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇది జనాభా నియంత్రణ విషయంలో!
ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. మోడీ నెక్ట్స్ టార్గెట్ అదే క్లూ ఇచ్చారు! దేశంలో జనాభా నియంత్రణ చట్టం రాబోతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే గనుక వస్తే పెను సంచలనం అవుతుంది.
భారత దేశంలో జనాభా మొదటి నుంచి ఇబ్బడి ముబ్బడిగానే ఉంది. అధిక జనాభాతో పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ ప్రయత్నాలు సాగించింది దశాబ్దాల పాటు. చివరకు ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. కుటుంబ నియంత్రణను చాలా మంది పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ తరంలో చాలా కుటుంబాలు ఒకరికే పరిమితం కావడం వల్ల దేశంలో భవిష్యత్తులో యువ మానవవనరులు అందుబాటులో ఉంటాయా అనే సందేహాలూ ఉన్నాయి.
కొన్ని దేశాలు నియంతృత్వంగా జనాభా నియంత్రణ చేసి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి కూడా. ఇలాంటి నేపథ్యంలో జనాభా నియంత్రణ చట్టం అంటూ బీజేపీ వాళ్లు ప్రకటించడం ఒకింత సంచలనమే. అయితే బీజేపీ చట్టాలు ప్రధానంగా ఒక వర్గం వారినే టార్గెట్ గా చేసుకున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఈ జనాభా నియంత్రణ చట్టం కూడా ఒక వర్గం జనాభా విషయంలో కాషాయ ధారులు వ్యక్తం చేసే ఆందోళనలకు తగ్గట్టుగా ఉంటుందా? అనే అభిప్రాయాలూ అప్పుడే వినిపిస్తూ ఉండటం గమనార్హం!