రావెల‌...జానీమూన్..మ‌ళ్లీ అదే ర‌చ్చ‌

Update: 2017-04-29 12:53 GMT
తెలుగుదేశం పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త నెల‌కొల్పడం, వారు ఐక్యంగా ఉండ‌టం అనేది అనుకున్నంత ఈజీ కాద‌నే విష‌యం మ‌రోమారు రుజువు అయింది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో జంప్ జిలానీ నేత‌లు - పాత టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని జిల్లాల్లో సీనియ‌ర్లు - ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు పొస‌గ‌డం లేదు. ఇలాంటి వాటిలో ప్ర‌ముఖంగా క‌నిపించేది గుంటూరు జిల్లా. గుంటూరులో గ‌తంలో  జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ - మాజీ మంత్రి - ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు మ‌ధ్య నేరుగా సాగిన దూష‌ణ‌ల పర్వం టీడీపీ పెద్ద‌ల జోక్యంతో స‌ద్దుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే. అయితే అది మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా పిడిగుద్దుల వ‌ర్షం కురిసే స్థాయికి చేరింది.

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న విబేధాలు మ‌రోమారు స్ప‌ష్టం అయింది. త‌మ వారికే ప‌గ్గాలు ద‌క్కాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఇటు మాజీ మంత్రి రావెల‌ - అటు జెడ్పీ చైర్మ‌న్ జానీమూన్ విషయంలో వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఇది కాస్త ముదిరిపోయి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంత‌రం రెండు ప‌క్షాల నేత‌లు బాహాబాహీ తలపడ్డారు. దీంతో వారిని విడిపించ‌డం రాష్ట్ర ప‌రిశీల‌కుల‌కు స‌మ‌స్యగా మారింది. కాగా గతంలో కూడా జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్‌ - రావెల మధ్య విభేదాల కారణంగా జడ్పీ సమావేశం రసాభాసగా మారడమే కాకుండా బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంత‌రం పార్టీ నేత‌లు స‌ర్దిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News