'కావేరీ' లొల్లి.. తమిళనాడు-కర్ణాటక మధ్య మళ్లీ మొదలైంది!

Update: 2022-03-23 06:33 GMT
తమిళనాడు-కర్ణాటక మధ్య ఎప్పటి నుంచో కావేరీ జలాల వివాదం నడుస్తోంది. నీటి పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ నాయకులు కావేరీ నీటి విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే తమిళనేతల తీరుపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళ ప్రజల సమస్యల గురించి పట్టని ఆ రాష్ట్రనేతలు కావేరీ నీటి విషయంలో మాత్రం ఎగిరెగిరి పడుతుంటారని విమర్శించారు. కావేరీ నీటితోనే రాజకీయం చేసి కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. నీటి సమస్య పరిష్కారం అయినా కూడా పదే పదే సుప్రీంకోర్టులో పిటీషన్లు వేసి కాలం గడిపేస్తున్నారని విరుచుకుపడ్డారు.

కావేరీ నీటి విషయంలో కర్ణాటకకు న్యాయం జరిగే వరకూ ఎంతవరకైనా పోరాటం చేస్తామని.. తాగునీటి విషయంలో తాము రాజీపడే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కావేరీ నది పుట్టింది కర్ణాటకలో అనే విషయం తమిళనాడు రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సీఎం బొమ్మై హితవు పలికారు.

కావాలనే తమిళనాడు రాజకీయ నాయకులు మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అవసరం అయితే కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావేరి నీటి కోసం పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారని సీఎం సంచలన ప్రకటన చేశారు.

కావేరీ నీటి పంపిణీ విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. మంగళవారం తమిళనేతలపై సీఎం బొమ్మై విరుచుకుపడ్డారు.కావేరీ నీరు పంపిణీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటైందని..  ప్రత్యేక బోర్డు తీర్పును ఇచ్చాక కూడా ఎక్కువ నీటి వాటా అడుగుతున్న తమిళ రాజకీయ నేతలపై సీఎం బొమ్మై మండిపడ్డారు. కర్ణాటకలోని ప్రజల గురించి ఏమాత్రం ఆలోచిచండం లేదని విమర్శించారు. కావాలనే మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని బసవరాజ్ బొమ్మై ఆరోపించారు.

కావేరీ నీటి విషయంలో కర్ణాటకకు న్యాయం జరిగే వరకూ ఎంతవరకైనా పోరాటం చేస్తామని..తాగునీటి విషయంలో తాము రాజీపడే అవకాశం ఏమాత్రం లేదని సీఎం బొమ్మై స్పష్టం చేశారు. కర్ణాటకలోని అన్ని పార్టీలు కావేరీ నీటి కోసం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని సీఎం బొమ్మై సంచలన పిలుపునిచ్చారు.
Tags:    

Similar News