ఇంత‌టి ఘోరం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.. చ‌దివితే క‌న్నీళ్లు ఆగ‌వు బ్రో!!

Update: 2023-01-01 19:14 GMT
కొన్ని ఘోరాలు.. త‌లుచుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. ఇంకొన్ని క‌న్నీళ్ల‌ను  ఎంత ఆపుకోవాల‌ని అనుకున్నా ఆగ‌వు. ఈ రెండు క‌ల‌గ‌లిసి.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను నివ్వెర‌పోయేలా చేసే ఘ‌ట‌న యూపీలో చోటు చేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి మృతి చెందాడు. ఆ స‌మ‌యంలో ఎవ‌రు ఉన్నా.. వెంట‌నే స‌ద‌రు ప్ర‌మాదానికి గురైన వ్య‌క్తిని కాపాడుతారు. కానీ, ఇక్క‌డ తెలియ‌క జ‌రిగిన దారుణం.. ఆ వ్య‌క్తిని నామ రూపాలు కూడా లేకుండా చేసింది. దీనికి కార‌ణం.. పొగ‌మంచు!!

ఉత్తర్ప్రదేశ్లో  ఆగ్రా-ఢిల్లీ హైవేపై  ఓ వ్య‌క్తి బైక్‌ను న‌డుపుతూ.. ఇంటికి వెళ్తున్నాడు. అయితే..అ ప్ప‌టికే ద‌ట్టంగా పొగ‌మంచు ముసురు కోవ‌డంతో ఎదురుగా ఏముందో కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి. దీంతో ఏం త‌గిలిందో ఏమో.. స్పీడుగా వెళ్తున్న బైక్ ప్ర‌మాదానికి గురై.. స‌ద‌రు వ్య‌క్తి కింద ప‌డిపోయి.. కొద్ది సేప‌టికి మ‌ర‌ణించాడు. మ‌రి ఈ స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రూ లేరా?  ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదా? అంటే.. భారీ ఎత్తున వ‌చ్చిపోయే వాహ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇది అతి పెద్ద‌హైవే.

కానీ, పొగ‌మంచులో.. ఎవ‌రూ ఈ ఘ‌ట‌న‌ను గుర్తించ‌లేదు. బైకు.. ఎక్క‌డో మూల‌న ప‌డింది. వ్య‌క్తి బాడీ మాత్రం రోడ్డు మ‌ధ్య‌లో ప‌డింది. కానీ.. పొగ‌మంచులో అంద‌రూ.. ఇదేదో `కుక్క శ‌వం` అనుకుని.. దాని మీదుగా వాహ‌నాల‌ను న‌డిపించేశారు. ఇంకేముంది..ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు స‌ద‌ర‌కు బాడీపై నుంచి ప్ర‌యాణించాయి. దీంతో వ్య‌క్తి దేహం తునాతున‌క‌లు అయిపోయింది. క‌నీసం గుర్తించేందుకు(సున్నంలోకి ఎముక కూడా దొర‌క‌కుండా) కూడా అవ‌కాశం లేని ప‌రిస్థితికి చేరింది. పేస్ట్ పేస్ట్ అయిపోయింది.

ఎవ‌రో మ‌హానుబావుడు.. రోడ్డుపై ఆ స‌మ‌యంలో న‌డిచి వెళ్తుండగా.. ర‌క్త‌పు వాస‌న‌లు రావ‌డంతో పోలీసులకు పోన్ చేశాడు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు సోమవారం గడ్డపార సహాయంతో రోడ్డుకు అంటుకుపోయిన శ‌రీర భాగాల‌ను సేకరించారు. పొగమంచు కారణంగా వాహనదారులకు మృతదేహం కనిపించలేదని, ఫలితంగా రాత్రంతా ఆ శవం టైర్ల కింద నలిగి నుజ్జునుజ్జు అయిందని పోలీసులు తెలిపారు. దాదాపు 100 మీటర్ల పాటు చిన్నచిన్న ముక్కలుగా చెల్లాచెదురుగా మారిందని పోలీసులు తెలిపారు.

ఎవ‌రీ అభాగ్యుడు?

ఈ అభాగ్యుడిని యూపీలోని కీతం శూర్సరోవర్ ప్రాంతంలో మధ్యప్రదేశ్కు చెందిన గోవింద్ నగర్ నివాసి గంగా చరణ్ నర్వారియా(30)గా పోలీసులు గుర్తించారు. ఇత‌నిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద‌ట్టంగా కురుస్తున్న‌ పొగమంచు కారణంగా ఆ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. మృతదేహాన్ని గమనించని వాహనదారులు దానిపై నుంచి ప్రయాణించారు. దీంతో టైర్ల కింద నలిగిన శరీరం హైవేపై.. దాదాపుగా 100 మీటర్ల వరకు ముక్క‌లు ముక్క‌లుగా పేస్ట‌యిపోయి అతుక్కుపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News