దక్షిణాదిలో తన సత్తా చాటుకోవాలని సన్నాహాలు చేస్తున్న భారతీయ జనతాపార్టీకి కొత్త దోస్తీ కుదిరింది. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని అన్నాడీఎంకే సమన్వయకర్త - తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో అన్నాడీఎంకే - కాంగ్రెస్ పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగిన సందర్భంగా పన్నీర్ సెల్వం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో - రాబోయే ఎన్నికల్లో పొత్తు గురించి స్పష్టత కూడా వచ్చినట్లయింది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార అన్నాడీఎంకే - ప్రతిపక్ష డీఎంకే - కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో చిక్కుకోవడం వల్లే రాష్ట్రానికి అందాల్సిన నిధులను పళని సర్కార్ డిమాండ్ చేయడం లేదని సీఎల్పీ నేత కేఆర్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వేడి రాజేశాయి. దీనిపై ముఖ్యమంత్రి పళనిస్వామి - ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం - మంత్రి జయకుమార్ ఘాటుగా స్పందించే ప్రయత్నం చేశారు. దానిని సీఎల్పీ నేత తిప్పికొట్టేందుకు ప్రయత్నించడంతో సభలో మాటల యుద్ధం తప్పలేదు. ఇదే విషయమై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలూ సభలో దుమారం రేపాయి. కేంద్రప్రభుత్వం చేతిలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం బెదిరిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, తాము ఎవరి చేతిలోనూ చిక్కుకోలేదని - అవసరమైన నిధులు పొందేందుకు పోరాడుతున్నామని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తామూ అలాగే పోటీ చేస్తామంటూ ఓ.పన్నీర్ సెల్వం తెలిపారు.
`` కాంగ్రెస్- డీఎంకే మధ్య పొత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసే ప్రసక్తే ఉండదు. అటువంటి అవకాశం లేదు`` అని సెల్వం తేల్చేశారు. ఇతర పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే తామూ ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. అంతేగానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా ఒంటరిగా పోటీ చేయబోమని తెలిపారు. బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలు కూడా విడివిడిగా పోటీ చేయబోమని ధ్రువీకరించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు మంత్రులు ఎస్పీ వేలుమణి, పీ తంగమణి ఎన్నికల్లో పొత్తు విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చర్చిస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో పొత్తుల ఖరారు కోసం అన్నాడీఎంకే ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీలో వీరిద్దరూ ఉన్నారు.
ఇదిలాఉండగా, తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఎక్కువమంది ఓటర్లు ఉన్నారు. ఫలితాలను శాసించే స్థాయిలో వీరి సంఖ్య - నియోజకవర్గాలు ఉండటంతో పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటించారు. ఇక్కడినుంచే సీఎం పళని స్వామి నాయకుడిగా ఎదిగారు. మరోవైపు ఈ ప్రాంతంలో అన్నాడీఎంకేకు మంచి బలం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపత్ంయలో...పొత్తు ఖాయమనే వ్యాఖ్యలు సైతం తెరమీదకు వస్తున్నాయి.