గతకొన్ని రోజులుగా తమిళనాడులో ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించినపటినుంచీ ఈ చర్చ నడుస్తున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది. అదే... అమ్మ ఎలా చనిపోయింది, దానికి సంబందించిన పూర్తి విరవరాలు! ఈ విషయంపై ఇప్పటికే అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, తాజాగా కోర్టు కూడా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే పార్టీ నేతలు స్పందించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో దాచి పెట్టాల్సిన విషయమంటూ ఏమీలేదని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెబుతున్నారు. మద్రాస్ హైకోర్టు జయలలిత మృతిపై తాజాగా అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన ఆమె... జయలలిత చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు, విషయాలను కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తాము సమాధానం ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దివంగత సీఎం మరణం విషయంలో మద్రాసు హైకోర్టు నోటీసులు ఇస్తే తాము జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్య చెప్పారు. జయ మృతిపై డాక్టర్లు చెప్పిన వివరాలను తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న అంశంపై తానేమీ మాట్లాడబోనని వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్డీఏ రెండున్నరేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకయ్య ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
సెప్టెంబరు 22న జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ప్రతీ రోజూ అనేక అనుమానాలు ఆమె అభిమానులు వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే! ఎవరికైనా సరే... ఆమెను కలిసే అవకాశం, చూసే అవకాశం కూడా దాదాపు కల్పించని స్థాయిలో జరిగిన ఆమెకు చేసిన చికిత్స, డిశ్చార్జి అవుతారని భావిస్తున్న సమయంలో గుండెపోటు రావడం, అనంతరం ఆమె మరణించడం వరకూ జరిగిన అన్ని విషయాలను ప్రజలముందు ఉంచుతామని ఆమె తెలియజేశారు. కాగా, సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరినతర్వాత ఆమె మరణించేవరకూ ఏమేమి జరిగాయనే విషయాలను వెల్లడించాలని కోరుతూ అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/