ఏపీకి ప్రత్యేక హోదా అంశం హీటెక్కుతోంది. ఇటు అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీ అవివ్వాసాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి జాతీయ పార్టీలతో మద్దతు సేకరణ ప్రయత్నం చేస్తున్న క్రమంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని ఎఐఎడిఎంకె నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ విజ్ఞప్తి కోరారు. ఈ మేరకు పళనిస్వామికి స్టాలిన్ ఒక లేఖ రాశారు. ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.
కీలకమైన కావేరీ వాటర్‌మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని అందుకే అవిశ్వాసం వేదికగా తమ గళాన్ని వినిపించాలని స్టాలిన్ కోరారు. టీడీపీ, వైసీపీ పెట్టిన తీర్మానాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. కాగా, దక్షిణ భారతదేశాన్ని ద్రావిడనాడుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్టాలిన్ స్వాగతించారు. ద్రావిడనాడు ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలతో ద్రావిడ నాడు ఏర్పాటు చేసే అంశంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. తమిళనాడులోని ఈరోడ్‌లో విలేకరులతో స్టాలిన్ మాట్లాడుతూ ఇది జరిగితే, తప్పకుండా స్వాగతిస్తామని, జరుగుతుందనే నమ్మకం తనకుందని స్టాలిన్ చెప్పారు.
ఇదిలాఉండగా...టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి ఏయే పార్టీలు మద్దతిస్తున్నాయి, అలాగే విభజన హామీల అమలు విషయంలో ఏపీకి ఏయే పార్టీలు ఏపీకి సపోర్ట్ చేస్తున్నాయి లాంటి వివరాలన్నీ ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. వివిధ పార్టీ నేతలతో జరిగిన చర్చల వివరాలను తోట నర్సింహం సీఎంకు వివరించారు. జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చలపైనా బాబు ఆరా తీశారు. టీడీపీకి ఎక్కువ ప్రచారం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.