టెలికాం దిగ్గజం జియో రాకతో భారతీయ టెలికం పరిశ్రమలో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎయిర్ టెల్ సహా - వొడాఫోన్ - ఐడియా సెల్యులార్ లు భారీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ఎయిర్ సెల్ కూడా చేరింది. ఓ వైపు కాల్ డ్రాప్స్.. మరోవైపు సంస్థ మూతబడుతున్నదన్న వార్తలు.. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజే లక్షలాది మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను ఇతర నెట్ వర్క్ ల్లోకి మార్చుకునేందుకు ప్రయత్నించారు. వీరంతా ఎయిర్ సెల్ కస్టమర్లవగా - తరచూ వేధిస్తున్న కాల్ డ్రాప్స్ తో బుధవారం దాదాపు 9 లక్షల మంది మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ)కి వెళ్లారు. నిజానికి, గురుగ్రామ్‌కు చెందిన ఈ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. తీవ్ర నిధుల కొరతను చవిచూస్తున్న ఎయిర్‌సెల్.. ఇప్పటికే తమ ఉద్యోగులకు సంస్థ మూసివేతకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలనిచ్చింది కూడా. ఎయిర్ సెల్ సీఈవో ఖైజద్ హీర్జీ.. ఇటీవల ఉద్యోగులనుద్దేశించి పంపిన ఓ ఈ-మెయిల్ లో నిధుల కొరత ఉన్నదని - ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపైనే సంస్థ భవితవ్యం ఆధారపడి ఉన్నదని చెప్పేశారు. ఇక దివాలా కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ టీ) వద్దకు వెళ్లే యోచనలోనూ ఎయిర్ సెల్ ఉందన్న వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. దీంతో కస్టమర్ల మదిలో ఇప్పుడు అనేక సందేహాలు మెదులుతున్నాయి.
2016 సెప్టెంబర్ లో రిలయన్స్ జియో రాక నేపథ్యంలో ఎయిర్ సెల్ సహా మెజారిటీ టెలికం సంస్థలు నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. గతనెల 30న ఎయిర్ సెల్ దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో టెలికం సేవల్ని ఎయిర్ సెల్ నిలిపివేసింది. గుజరాత్ - హర్యానా - హిమాచల్ ప్రదేశ్ - మహారాష్ట్ర - మధ్య ప్రదేశ్ - ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ) సర్కిళ్లు మూతబడ్డాయి. రూ.60 కోట్ల బకాయిల కారణంగా 10 రోజుల కిందట ఐడియా సెల్యులార్.. ఎయిర్ సెల్ తో ఇంటర్ కనెక్ట్ సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఎయిర్ సెల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. కస్టమర్ల తాకిడిని తట్టుకునే శక్తి సన్నగిల్లినైట్లెంది. ఫలితంగానే కాల్ డ్రాప్స్ అవుతుండగా - చాలామంది ఇతర సంస్థల్లోకి వెళ్లిపోతున్నారు. కాగా, టెలికం రంగంలోని తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య తాము సేవల్ని కొనసాగించడం కష్టమేనని ఎయిర్ సెల్ ఇప్పటికే చెప్పింది.
గడిచిన వారం రోజులుగా అన్ని ఎయిర్ సెల్ సర్కిళ్లలో కస్టమర్లకు నెట్ వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయి. రాజస్థాన్ - కోల్‌కతా - చెన్నై - ఒడిషా - ఢిల్లీల్లోని కొద్దిమంది మొబైల్ వినియోగదారులు తమ నంబర్లపై నెట్ వర్క్ పనిచేయడం లేదని - తరచూ కాల్ డ్రాప్స్ అవుతున్నాయని ఇప్పటికే ఫేస్ బుక్ - ట్విట్టర్ల ద్వారా వెల్లడించారు. ఇదే సమయంలో ఎయిర్ సెల్ దివాలా తీయనుందని - టెలికం టవర్ కంపెనీలకు భారీగా బకాయి పడిందంటూ మీడియాలో వార్తలు రావడం కస్టమర్లలో భయాలకు దారితీసింది. ఫలితంగానే లక్షలాది మంది ఎంఎన్ పీకి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సుమారు 3 లక్షల మంది - బుధవారం దాదాపు 9 లక్షల మంది ఎంఎన్ పీకి విజ్ఞప్తి చేశారు. కాగా - నిరుడు సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ కస్టమర్లు 88.8 మిలియన్లుగా ఉన్నారు. ఇందులో తమిళనాడు వాటానే 20 మిలియన్లు.
కంపెనీ కథ కంచికేనా? అనే ప్రశ్నకు సమీప భవిష్యత్తులోనైతే కాదు అని సంస్థ సమాధానమిస్తోంది. కంపెనీని మూసేస్తున్నారన్న దానిపై ఫేస్ బుక్ - ట్విట్టర్లలో పలువురు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేయడంపై ఎయిర్ సెల్ స్పష్టత ఇచ్చింది. మా సేవల్ని కొనసాగిస్తాం. ఈ విషయంలో ఒకవేళ ఏవైనా అవాంతరాలు ఎదురైతే.. కస్టమర్లకు ముందే తెలియజేస్తాం అని తెలిపింది. కాల్ డ్రాప్స్ అనేది వ్యవస్థీకృత అంతరాయం అంటూ ఓ సీనియర్ అధికారి ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ అసౌకర్యానికి విచారిస్తున్నామంటూ క్షమాపణలు చెప్పారు. తమకు సహకరించాలని కస్టమర్లను కోరారు. అయినప్పటికీ భవిష్యత్తుపై సంస్థ నుంచి స్పష్టత రాకపోవడం - మూతపడబోదన్న విశ్వాసం కనిపించకపోవడం ఎయిర్ సెల్ మనుగడను ప్రశ్నార్థకమే చేస్తోంది.