కేసీఆర్ టవర్ల కలకు ఓకే చెప్పేశారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు భారీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాకుంటే.. ఆ కలలకు నిబంధనలు తరచూ అడ్డు పడుతుంటాయి. తాజాగా అలాంటి అడ్డంకి ఒకటి తొలిగిపోయింది. హైదరాబాద్ మహానగరంలో పోలీస్ విభాగానికి సంబంధించి అతి పెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని.. నగర పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేసేందుకు 40 అంతస్తులతో కూడిన రెండు భారీ టవర్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. ఇందుకోసం భారీ ప్రణాళికనే రచించారు.
చివరకు.. ఆ టవర్లకు సంబంధించిన ఊహాచిత్రాల్ని విడుదల చేశారు. అన్ని బాగానే ఉన్నా.. నిబంధనలు కొన్ని ఉంటాయని.. ప్రభుత్వ కలలకు తగ్గట్లుగా అన్ని పనులు చేయటం సాధ్యం కాదన్న విషయం తర్వాత అర్థమైంది. సుమారు రూ.700కోట్లకు పైనే ఈ టవర్లు.. ఇందులోని సాంకేతికత కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే.. ఈ టవర్ల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో ఏర్పాటు చేసేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురుకాగా.. వాటిని క్లియర్ చేసి భవన నిర్మాణానికి వెళ్లటానికి రెఢీ అవుతున్న నేపథ్యంలో.. టవర్ ఎత్తుకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం కావటంతో అది కాస్తా ఆగిపోయింది.
తాజాగా.. ఈ రెండు టవర్ల విషయంలో ప్రభుత్వ వినతిని.. నిబంధనల్ని చూసుకొని చివరకు 89 మీటర్ల ఎత్తులో భవనాలను నిర్మించుకోవటానికి వీలుగా అనుమతులు వచ్చేశాయి. కాకుంటే.. మొదట్లో అనుకున్నట్లు 40 అంతస్తుల్లో కాకుండా 20 అంతస్తుల్లోఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ ట్విన్ టవర్లను ఏర్పాటు చేసి.. కేసీఆర్ సర్కారు ఎలా పని చేస్తుందనటానికి నిదర్శనంగా నిలపాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.