ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అతివాద నేత, ఆ పార్టీ ఎంపీగా ఉన్న ఆదిత్యనాథ్ యోగీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గోమాంసం - కబేళాల నిషేధం - ముస్లిం మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రిపుల్ తలాక్ - అయోధ్యలో రామ మందిరం తదితర అంశాలపై చర్చ మరింతగా పెరిగిందనే చెప్పాలి. అవతలి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్న విషయంతో ఏమాత్రం సంబంధం లేకుండా... ముందుకు సాగుతున్న యోగీ... తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. దేశంలో గోమాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఆయన... యూపీలో ఆ దిశగా చర్యలను ఎప్పుడో ప్రారంభించేశారు కూడా. గోమాంస నిషేధంలో భాగంగా ఇప్పటికే అనుమతి లేకుండా నడుస్తున్న కబేళాలపై యోగీ సర్కారు ఉక్కుపాదం మోపేసింది.
ఈ నేపథ్యంలో ముస్లింలు పవిత్ర ప్రదేశంగా పరిగణించే అజ్మీర్ దర్గా మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ ఓ సంచలన ప్రకటన చేశారు. దేశంలో మత సామరస్యానికి కొత్త ఊపిరిలూదుతున్నట్లు ఉన్న ఆయన ప్రకటన... నిజంగానే యావత్తు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అయినా జైనుల్ అబెదిన్ చేసిన ప్రకనటలేంటంటే... గోమాంసం తినడం మానేయాలని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని ఆయన సంచలన ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరైన అజ్మీర్ ఉర్సు (ఖాజా మొయినుద్దీన్ చిస్తీ వర్దంతి) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
గోమాంసం తినడాన్ని మానేయాలని ప్రకటించడంతోనే సరిపెట్టుకోని ఆయన... ఆ విషయంలో తన కుటుంబం ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకుందని, ఇకపై తమ కుటుంబ సభ్యులెవరు కూడా గోమాంసాన్ని భుజించరని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తన కుటుంబ సభ్యులంతా ముక్త కంఠంతో ఏకీభవించారని ఆయన చెప్పారు. ఇతర మతస్తుల విశ్వాసాలను గౌరవించాలన్న ప్రాథమిక సూత్రం ఆధారంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంపై ముస్లిం సోదరులంతా ఆలోచించి హిందువులకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. గోమాంసాన్ని భుజించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం యువకులు దురాగతాలకు పాల్పడుతున్నారని, దీంతో ముస్లిం మహిళలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలాక్ చెప్పడమంటే మహిళల ఆత్మ గౌరవాన్ని తగ్గించడమే అవుతుందన్నారు. తలాక్ చెప్పడం మానేయాలని ముస్లిం భర్తలకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇందుకోసం ఖురాన్ ను అడ్డుపెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తలాక్ ను సవాల్ చేస్తూ ముస్లిం మహిళలు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని గుర్తుచేశారు.
ఈ ప్రకటనలు వెలువడ్డ వెంటనే ముస్లిం మత పెద్దలు చాలా వేగంగా స్పందించారు. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే ఖురాన్‌లోనే ట్రిపుల్ తలాక్ ఉందని, అలాంటిది ఖురాన్‌ను ధిక్కరించేలా జైనుల్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. అంతేకాకుండా... ఏళ్లుగా తాము గోమాంసాన్ని భుజిస్తున్నామని, ఇతర దేశాల్లో లేని నిషేధం ఒక్క భారత్‌లోనే ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించిన వారంతా... గోమాంసానికి నో చెప్పిన జైనుల్‌ను అజ్మీర్ దర్గా మత గురువు పోస్ట్ నుంచి తప్పించేశారు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/