మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఐదుగురు సన్యాసులకు మంత్రి హోదా కట్టబెట్టడంపై అత్యున్నత హైందవ మత సంస్థ విస్మయం వ్యక్తం చేసింది. ఓవైపు సాధు సంతువులు మరోవైపు సాధువుల వేదికలు సైతం ప్రకటనలు విడుదల చేశాయి. సన్యాసులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను బెదిరించి పదవులను పొందారని అఖిల భారతీయ అఖాడా పరిషత్ (ఏబీఏపీ) ఆరోపించింది. సీఎం అటువంటి బెదిరింపులకు లొంగకూడదని హితవు చెప్పింది. వారిపై సరైన చర్య తీసుకుంటామని, దేశంలోని 13 ప్రధాన అఖాడాలకు ఏబీఏపీ సమన్వయ సంస్థ. సదరు సాధువులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అన్నారు. ఈ ఐదుగురు సాధువులు ప్రభుత్వ నర్మద పరిరక్షణ పథకంలో జరిగిన కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతామని ఇటీవల ప్రకటించారు. మంత్రి హోదా లభించిన మరుసటి రోజే వారిలో ఇద్దరు తమ ఆందోళనను విరమిస్తున్నట్టు తెలిపారు.
ఐదుగురు సాధువులకు సహాయ మంత్రి హోదా కల్పించడం ఎన్నికల జిమ్మిక్కు అని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే స్వార్థ రాజకీయాలను చేస్తున్నారని ఆరోపించారు. 'ప్రజల్ని మంచి మార్గం వైపుకు నడిపించే వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం సముచితం. ఎవరో ముక్కు - మొఖం తెలియని వారిని తీసుకొచ్చి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి హోదా కల్పించడం శోచనీయం' అని పేర్కొన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు - ప్రజాస్వామ్య వాదులు తాజా ఆదేశాలపై మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇండోర్ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.