వైసీపీ గవర్నమెంట్ లో టీడీపీ నేతకు రూ.200 కోట్ల కాంట్రాక్ట్?

Update: 2019-09-19 10:47 GMT
తెలుగుదేశం పార్టీ హయాంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన వైనం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ వచ్చింది. ఒక సామాజికవర్గానికి చెందిన వారికి వివిధ ప్రాజెక్టుల్లో భారీగా దోచి పెట్టారని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ మేరకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకా నిపుణుల కమిటీ కూడా అదే తేల్చింది. వివిధ కాంట్రాక్టర్లకు ముందస్తుగా చెల్లింపులు చేయడం - నాణ్యతలేని పనులకు భారీగా బిల్లులు ఇవ్వడం.. వంటి వ్యవహారాలతో పాటు ఎన్నికలకు వారం పది రోజులు ముందు కూడా భారీ ఎత్తున నామినేషన్ల మీద పనులు ఇవ్వడం - అలా దోచి పెట్టడం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తేల్చింది.

ప్రజలు కూడా ఆ విషయాలను గ్రహించి టీడీపీని చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు. విశేషం ఏమిటంటే..జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. కాంట్రాక్టర్లు మాత్రం మారడం లేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో వెలిగిన వారు - అప్పుడు భారీగా దోచిన వారికే అయాచిత లబ్ధి కలుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక భారీ కాంట్రాక్టు  తెలుగుదేశం నేతకే దక్కుతోందని సమాచారం.

అది గ్రామ సచివాలయాల నిర్మాణం - వాటిల్లో ఏర్పాట్లకు సంబంధించిన భారీ కాంట్రాక్టును తెలుగుదేశం నేత ఒకరు పొందినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరు సుధీర్ చౌదరి. అక్షర ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థకు యజమాని అయిన సుధీర్ చౌదరి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టును పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కాంట్రాక్టర్ మాత్రమే కాదు - తెలుగుదేశం పార్టీ నేత కూడా.ఈ నేపథ్యంలో ఆయనకు విలేజ్ సెక్రటేరియట్ ల నిర్మాణం - వాటి మౌళిక సదుపాయాల కల్పన కాంట్రాక్టు దక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇలాంటి భారీ కాంట్రాక్టు ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తికి దక్కుతుండం పట్ల పరిశీలకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకవైపు అప్పుడు అయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్ల పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతూనే మరోవైపు..మళ్లీ అ కోవలోని వారికే కాంట్రాక్టులను కేటాయిస్తున్నారా అనే ఆశ్చర్యాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి!


Tags:    

Similar News