ఇతని కడుపులో మద్యం ఊరుతోంది

Update: 2020-07-12 15:30 GMT
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన డేనీ గియానోటో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమంటే అతను మద్యం తాగలేదు. అల్కాహాల్ తీసుకోకపోయినప్పటికీ బ్రీత్ అనలైజర్ టెస్టులో మాత్రం తాగినట్లుగా తేలింది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా, అత్యంత ఆసక్తికర విషయం వెల్లడైంది. పరీక్షల్లో అతనికి కడుపులోనే మద్యం ఊరుతున్నట్లు తేలింది.

కేక్స్, బ్రెడ్స్, పిజ్జాలు వంటివి తింటే అల్కాహాల్ మరింత ఎక్కువగా ఊరుతుంది. కార్బో హైడ్రేట్స్ మద్యంగా మారే ఈ ప్రక్రియను ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంటారు.

గతంలోను పెన్సిల్వేనియాకు చెందిన ఓ మహిళ కడుపులో మద్యం తయారయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో అల్కాహాల్ వాసన రావడంతో పరీక్షలు చేయించుకుంది. వైద్యులు తొలుత ఆమెకు మద్యం అలవాటు ఉందని భావించారు. తనకు ఆ అలవాటు లేదని ఆమె చెప్పింది. కానీ సంబంధిత పరీక్షలు చేయడంతో అశలు ఆమె రక్తంలో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు.

ఆమె కడుపులో ఈస్ట్ జాతికి చెందిన శిలీంధ్రం అధికస్థాయిలో ఉన్నదని గుర్తించారు. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉత్పత్తవుతూ ఎప్పటికి అప్పుడు బయటకు విసర్జించబడే ఈ శిలీంధ్రాలు.. ఆమె షుగర్ పేషెంట్ కావడంతో పేగుల్లో ఎక్కువగా తిష్ట వేశాయని గుర్తించారు. చక్కెర, ఈస్ట్‌ లు అల్కాహాల్ తయారీకి ఉపయోగిస్తారు. అలాగే బాధితురాలి కడుపులో ఈ రెండు కలిసి మద్యంలా మారినట్లు తేల్చారు.
Tags:    

Similar News