సచిన్ జట్టు ఓడినా.. ‘స్ఫూర్తి’ గెలిచింది

Update: 2015-11-08 04:30 GMT
దిగ్గజ క్రికెటర్లు మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం నిర్వహిస్తున్న క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నీలో తొలి మ్యాచ్ న్యూయార్క్ లో జరిగింది. ఈ తొలి టీ 20 మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ జట్టు.. వార్న్ వారియర్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పలు దేశాలకు చెందిన ప్రముఖ క్రికెటర్లతో ఆడిన ఈ మ్యాచ్ కు అనూహ్య స్పందన లభించింది. క్రికెట్ ను అభిమానించే వారు అమెరికాలో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని చాటి చెబుతూ భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన వారిలో భారత్.. ఆస్ట్రేలియా.. తదితర దేశాలకు చెందిన వారు ఎక్కువగా కనిపించారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సచిన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ జట్టులో సెహ్వాగ్ తన సత్తా చాటారు. కేవలం 22 బంతుల్లో ఆరు సిక్సర్లు.. మూడు ఫోర్లతో 55 పరుగులు చేశారు. సెహ్వాగ్ ఆడుతున్నంతసేపు స్టేడియంలో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేశారు. సెహ్వాగ్ తన షాట్లతో అలరించాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సచిన్ తన బ్యాట్ తో పెద్దగా మెరుపులు మెరిపించలేదు. కేవలం 26 పరుగులు మాత్రమే సచిన్ చేశాడు. వార్న్.. సైమండ్స్ ఇద్దరూ చెరో మూడు వికెట్లు తీయటంతో సచిన్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.

అనంతరం లక్ష్య చేధనలో భాగంగా వార్న్ వారియర్స్ బరిలోకి దిగారు. లక్ష్య చేధనలో జట్టు మొదట తడబడినా.. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రికీ పాటింగ్ ఆటతో జట్టు గెలుపు వాకిట నిలిచింది. అతనికి తోడుగా సంగక్కర 41 పరుగులు వార్న్ వారియర్స్ జట్టు విజయం సాధించేందుకు సాయం చేసింది. సంగక్కర మూడు సిక్స్ లు.. రెండు ఫోర్లతో 41 పరుగులు చేయగా.. పాటింగ్ మూడు సిక్స్ లు.. మూడు ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఇక చివర్లో జాంటీ రోడ్స్ మూడు సిక్స్ లతో 20 పరుగులు చేయటంతో.. 17.2 ఓవర్లలోనే వార్న్ వారియర్స్ లక్ష్యాన్ని చేధించారు. దీంతో దిగ్గజ సిరీస్ లో వార్న్
Tags:    

Similar News