ఎప్పుడూ ఏదో ఒకటి రాజేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇప్పుడు అందరికీ టార్గెట్ అయిపోయారు. ట్విట్టర్ కొనుగోలుకు ముందుకొచ్చి ఇప్పుడు మొండికేస్తున్న ఎలన్ మస్క్ కు సంబంధించిన మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2016లో ఒక విమాన ప్రయాణ సమయంలో ఒక ఫ్లైట్ అటెండెంట్ ను లైంగికంగా వేధించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ సమయంలో సదురు బాధితురాలు ఈ విషయాన్ని బయటకు వెల్లడించకుండా ఉండేందుకు 2.50 లక్షల డాలర్లను చెల్లించినట్టు మస్క్ పై ప్రధాన ఆరోపణ.
దీనికి సంబంధించి సదురు ఎయిర్ హోస్టెస్ కు 2018లో స్పేస్ ఎక్స్ సంస్థ పైన చెప్పిన భారీ మొత్తాన్ని చెల్లించింది. సదురు ఉద్యోగిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పేస్ ఎక్స్ కు చెందిన కార్పొరేట్ జెట్ లో సేవలు అందిస్తోంది.
సదురు ఉద్యోగిని మసాజ్ సేవలు అందించేందుకు వీలుగా లైసెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లుగా పైగా ఒక సందర్భంలో ప్రపోజ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విషయాన్ని సదురు ఉద్యోగిని 2016లో తన మిత్రురాలితో చెప్పింది.
మసాజ్ చేస్తున్న సమయంలో ఎలన్ మస్క్ ఆమెను తాకినట్లు, వేరే ఆఫర్ కూడా ఇచ్చినట్లు సదురు ఉద్యోగిని తెలిపింది. కానీ ఇది రాజకీయంగా తనపై కావాలని చేస్తున్న అభియోగంగా ఎలన్ మస్క్ అంటున్నారు.
తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే తన మొత్తం 30 ఏళ్ల కెరీర్ లో ఇది మొదటిసారిగా వెలుగులోకి వచ్చే అవకాశం లేదని మస్క్ అంటున్నారు. ఇదంతా కట్టు కథ అని ఎలన్ మస్క్ కొట్టిపారేస్తున్నారు.