‘టీ’ స్పీకర్ సెక్యూరిటీ ఆఫీసర్ రాసలీలలు

Update: 2016-04-21 06:34 GMT
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సెక్యూరిటీ ఆఫీసర్ మీద వచ్చిన తాజా ఆరోపణ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వీవీఐపీ లాంటి కీలక నేతకు సెక్యూరిటీ అధికారిగా ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ.. అందుకు భిన్నంగా ఒక మహిళతో రాసలీలలు జరుపుతూ దొరికిపోయారన్న సమాచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను వెన్నెంటే ఉండి.. రక్షణ ఇవ్వాల్సిన సదరు అధికారి మావోయిస్ట్ ల ప్రభావం ఉన్న ప్రాంతంలో పర్యటిస్తున్న వేళ.. మరెంతో జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉన్నా.. ఆ విషయాన్ని వదిలేసి.. తన పని తానుచూసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వద్దకు పని మీద వచ్చిన ఒక మహిళతో స్పీకర్ భద్రతాధికారికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా సన్నిహిత సంబంధంగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీలోని స్పీకర్ క్యాంప్ ఆఫీసుకు సమీపంలో ఉన్న సదరు మహిళ ఇంటికి భద్రతాధికారి వెళ్లటం.. వీరి భాగోతాన్ని కొద్ది రోజులుగా గమనిస్తున్న కాలనీ వాసులు.. కుటుంబ సభ్యులు టైం చూసుకొని దాడి చేశారు.

దీంతో.. వంటి మీద సరిగా బట్టలు లేకుండా వీధుల్లోకి పరిగెత్తినట్లుగా చెబుతున్నారు. అదేసమయంలో అటు వైపుగా వెళుతున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం సదరు భద్రతాధికారిని ఆపి అదుపులోకి తీసుకున్నారని.. తన వివరాలు చెప్పి.. ఫోన్లు చేయించుకొని బతుకుజీవుడా అని బయటపడినట్లుగా చెబుతున్నారు. మొత్తమ్మీదా స్పీకర్ సెక్యూరిటీ అధికారి రాసలీలు వరంగల్ జిల్లాలో ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా.. సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి స్పీకర్ సెక్యూరిటీ అధికారి తనపై లైంగికంగా వేధించినట్లుగా ఫిర్యాదు చేయటం ఈ స్టోరీ మరో మలుపు తిరిగినట్లైంది. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. సదరు బాధితురాలి ఫిర్యాదును తీసుకున్న భూపాలపల్లి పోలీసులు స్పీకర్ పర్సనల్ సెక్యూరిటీ అధికారిపై కేసు నమోదు చేశారు. కక్కుర్తి ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టింది.
Tags:    

Similar News