రాజకీయ నాయకుడు అంటే .. నలుగురిని ముందుండి నడిపించే వాడు అంటే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అందుకే అంటారు రాజకీయ నాయకుడు బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని , అయితే కొందరు రాజకీయ నాయకులు మాత్రం రాజకీయాల్లోకి వచ్చింది కేవలం తాము , తమ కుటుంబం బాగుపడటానికే తప్ప , నలుగురి కోసం కాదు వారు ఎలా పొతే మాకేం అనే ధోరణి లో ముందుకు సాగుతుంటారు. అయితే ప్రజాక్షేత్రం లో ఎప్పటికైనా కూడా ప్రజల మద్దతు ఉన్నవాడే ఎక్కువ రోజులు రాజకీయాల్లో కొనసాగగలడు. అయితే కొందరు నేతలు మాత్రం ప్రభుత్వం నుండి పేదలకి వచ్చే సొమ్మును సైతం తమ అకౌంట్ లోకే వచ్చేలా చేసుకుంటుంటారు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు కొందరు నిజంగా ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం.
తాజాగా మరో నేత పై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పేదలకి చెందాల్సిన భూమిని అన్యాయంగా నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారట. చెరువు, కుంట, కాలువ, పోరంబోకు భూములను యథేచ్ఛగా కబ్జా చేశారట. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తన అనుచరులు 500 మందికి కట్టబెట్టారట. అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు 10వేల మంది నోట్లో మట్టికొట్టారని ఆరోపణలు చేస్తున్నారు. పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేసుకున్నారట. అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం రూ.కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు
ఇల్లు లేని వారికి, ఇంటి స్థలాలు ఇస్తామని ఆశచూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారని , అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారని , ఓట్ల కోసం కక్కుర్తి పడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక స్థోమత ఉన్న వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారట. ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేదట. దీంతో తమకి ఇంటి స్థలం ఉంది అని ఆనందపడే లబ్ధిదారులు దిక్కుతోచక ఆందోళనకి గురి అవుతున్నారట.
పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, జర్నలిస్టు కాలనీ, రజకుల కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో సుమారు 200 నకిలీ పట్టాలు బయటపడ్డాయట. తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్ ను కలవడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట. దీనిపై 22 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే, మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండ్ కో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే , పేదలకి అండగా నిలబడాల్సిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేస్తాడా అని షాక్ అవుతున్నారు. అయితే , ఈ వ్యవహారం లో నిజానిజాలు వెలుగులోకి రావాల్సింది ఉంది.