నందమూరి ఫ్యామిలీకి న్యూమరాలజీ మీద కాస్త నమ్మకం ఎక్కువన్న విషయం తెలిసిందే. తొమ్మిది అంకెను అదృష్టంగా భావించే ఆ కుటుంబ సభ్యులు.. తాము కొనుగోలు చేసే వాహనాలకు దాదాపుగా 9 అంకెతో ఉన్న నెంబర్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ..తాము ఎంపిక చేసుకున్న నెంబరు కోసం ఎవరైనా పోటీకి దిగితే.. ఎంతకైనా సరే అన్నట్లుగా వ్యవహరించి భారీగా డబ్బు చెల్లించి.. నెంబరును సొంతం చేసుకోవటం చూశాం.
ఆ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకు నచ్చిన నెంబర్ ను సొంతం చేసుకోవటానికి ఏకంగా రూ.10లక్షలు ఖర్చుపెట్టినవైనాన్ని మర్చిపోలేం. ఇదిలా ఉంటే.. తాజాగా నందమూరి ఫ్యామిలీకి చెందిన మరో హీరో తారకరత్న తన కొత్త వాహనానికి అవసరమైన నెంబరును సొంతం చేసుకునే విషయంలో వ్యవహరించిన వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారటం గమనార్హం.
హైదరాబాద్‌లో ఉండే తారకరత్న.. తాను కొన్నకొత్త కారుకు అవసరమైన 9999 నెంబరు కోసం తన పలుకుబడిని ప్రయోగించినట్లుగా కొత్త ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 9999 నెంబరు కోసం తారకరత్న తన పలుకుబడిని వినియోగంచటంతో పాటు.. అధికారికంగా లోగుట్టు ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నరసరావుపేటలో తారకరత్న నివాసం లేకున్నా.. బ్యాంకు ఖాతా ఒకటి తెరిచారు. దాన్ని అడ్రస్ ఫ్రూప్ గా చూపించి ఆర్టీవో కార్యాలయం నుంచి నంబరు పొందటం ఒక ఎత్తు అయితే.. నెంబరును కేటాయించిన వైనం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. తారకరత్న ఎంపిక చేసుకున్న నెంబరుకు బయట మార్కెట్ లో విలువ ఉన్నప్పటికీ.. ఒత్తిడి ప్రదర్శించిన అధికారులు.. పోటీలో లేకుండా కొందరిని తమదైన శైలిలో హ్యాండిల్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెంబరు కేటాయింపులో తారకరత్నకు ఎలాంటి లోటు జరగకుండా చూసిన రిజిస్ట్రేషన్ శాఖాధికారులు.. పనిలో పనిగా కేటాయించిన నెంబరు కార్డును సైతం నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి.. తమ స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఫ్యాన్సీగా కనిపిస్తున్న ఏపీ07 సీడబ్యూ9999నెంబరుకు కేవలం రూ.50వేలు మాత్రమే చెల్లించినట్లుగా చెబుతున్నారు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/