ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా అని సామెత. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకులకు పెద్దపీట వేస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం తెలంగాణవాదులను ఎందుకు పట్టించుకుంటారు!? కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నది కూడా ఇదే.
భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా, తన ప్రభుత్వ ఘనతలు పాటల ద్వారా తెలంగాణలో ఊరూరా ప్రతిధ్వనించాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ సాంస్కృతిక సారథికి శ్రీకారం చుట్టారు. కళాకారులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తామన్నారు. వారికి సీనియర్ అసిస్టెంట్ వేతనం అంటే సుమారు రూ.30 వేలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిని ఎంపిక చేసే బాధ్యతను ధూంధాం కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణకు అప్పగించారు.
తెలంగాణ ఉద్యమానికి తమ గొంతుతో ఊపిరిపోయిన కళాకారులకు బదులుగా అన్ని విధాలుగానూ తనను 'సంతృప్తి'పరిచిన వారికే రసమయి పెద్దపీట వేశారని కళాకారులే ఆరోపిస్తున్నారు. మంచి మంచి పాటలు రాసి.. దాదాపు దశాబ్దానికిపైగా ధూం ధాంలు నిర్వహించిన కళాకారులకు రసమయి రూపొందించిన ఉద్యోగుల జాబితాలో చోటు దక్కలేదు. సినిమాల్లో, టీవీల్లో సైడ్ యాక్టర్లుగా పని చేసిన వారికే రసమయి ఉద్యోగాలు ఇచ్చాడట. రసమయి తీరుపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కళాకారులు భగ్గుమంటున్నారు. కేసీఆర్ తమకు ఉద్యోగాలు ఇస్తే.. రసమయి మధ్యలో వాటిని కళాకారులు కానివారికి అమ్ముకున్నాడంటూ మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో నిరసన ధూం ధాం కూడా జరిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆడిపాడారు. రసమయి బాలకిషన్ తెలంగాణలో సాంస్కృతిక శాపం అంటూ శాపనార్థాలుపెట్టారు.