సతీష్‌ వేమన.. ఆగాలి నాయన

Update: 2019-01-28 01:30 GMT
రాజకీయాలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. వారం రోజుల క్రితం  రాజంపేట టీడీపీ ఎమ్మేల్యేగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి.. వైసీపీలోకి జంప్‌ అయ్యారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో మేడా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట సీట్‌ కు ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కావాలి. దీంతో.. లిస్ట్‌ లో చాలామంది ఉన్నా... తానా అధ్యక్షుడు సతీమ్‌ వేమన మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు ఛాన్స్‌ ఇస్తే.. తన అమెరికా పరిచయాలన్నీ ఉపయోగిద్దామని ప్లాన్‌ చేసుకున్నారు.

తానా అధ్యక్షుడిగా సతీష్‌ వేమకు గుర్తింపు వచ్చింది . ఇక ఏపీ నుంచి చంద్రబాబు - లోకేష్‌ - బాలయ్య వచ్చినప్పుడు సతీష్‌ వేమన హడావుడి మామూలుగా ఉండదు. టీడీపీకి ఎన్నో ఏళ్లుగా వీర విధేయుడిగా ఉన్న సతీష్‌ వేమన.. ఇప్పుడు రాజంపేట ఎమ్మెల్యే సీటుని ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆల్‌ రెడీ చంద్రబాబుని కూడా కలిశారు. ఒక్క అవకాశం ఇస్తే.. తన సత్తా ఏంటో నిరూపించుకుని రాజంపేట సీటుని గిఫ్ట్‌ గా ఇస్తానని చెప్పారు. అయితే.. చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకి ఉన్నాయి. అమెరికాలో తెలుగువారిని పోగేసి కల్చరల్‌ ప్రోగ్రామ్స్ చేసినంత వీజీ కాదు ఎమ్మెల్యేగా గెలవడం అని చంద్రబాబుకి తెలుసు. దీంతో…ఇంకొన్నాళ్లు నీ సేవలు పార్టీకి కావాలి అని చెప్పారట చంద్రబాబు. అంతేకాదు.. రాజంపేటలో మళ్లీ టీడీపీ జెండా ఎగిరేందుకు కృషి చేయాలని చెప్పి పంపించారు. అంటే. నాయనా వేమన.. ఇంకొన్నాళ్లు నువ్వు ఆగాలి నాయనా అని ఇన్‌ డైరెక్ట్‌ చెప్పి పంపించారు చంద్రబాబు.
Tags:    

Similar News