మద్రాస్ హైకోర్టు ​సంచలన తీర్పు​

Update: 2015-10-26 05:44 GMT
​అరాచకంగా వ్యవహరిస్తూ.. తీవ్రమైన నేరాలు చేస్తున్న దోషుల విషయంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మరాయి.  చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరిచాలని చెప్పటమే కాదు.. ‘‘విత్తు’’ కొట్టే కఠిన శిక్షను అమలు చేసినా తప్పులేదని వ్యాఖ్యానించటం గమనార్హం.

సంప్రదాయ చట్టాల కారణంగా పిల్లలపై అత్యాచారాలు లాంటి దారుణాలకు పాల్పడే వారిలో ఎలాంటి మార్పులు రాని నేపథ్యంలో.. అనాగరికంగా అనిపించినా.. అరాచకమైన శిక్షలు విధించటం తప్పేం కాదని.. ఇలాంటి శిక్షలు ప్రాశ్చాత్య చేశాల్లో అమలు చేస్తున్న విషయాన్ని మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది. చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసిన నిందితులకు 2.4శాతం శిక్షలు పడుతుంటే.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి సంఖ్య దాదాపు 400 శాతం పైనే ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. విత్తు కొట్టటం లాంటి దారుణమైన శిక్షను విధించటం ఎంతమాత్రం తప్పు కాదని పేర్కొంది.

ఇటీవల కాలంలో ఢిల్లీకి చెందిన ఇద్దరు చిన్నారులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నేపథ్యంలో.. మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విత్తు కొట్టే విషయంలో హైకోర్టు సుస్పష్టంగా ఉన్న నేపథ్యంలో దీనిపై పార్టీలు.. ప్రభుత్వం .. ప్రజా  సంఘాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి
Tags:    

Similar News