చీరాల మునిసిపాలిటీలో అధికార పార్టీ వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అక్కడ మొత్తం 33 వార్డులకు గానూ.. ఏకంగా 32 స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. కేవలం ఒకే ఒక స్థానం టీడీపీకి దక్కింది. ఇక ఇబ్బందేముంది అనిపిస్తోంది కదా! కానీ.. లోతుగా వెళ్తేగానీ అసలు విషయం అర్థం కాదు. వైసీపీ నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు అందరికీ తెలిసిందే.
ఇది మునిసిపల్ ఎన్నికల వేళ తారస్థాయికి చేరింది. ఈ నేతలిద్దరూ పోటా పోటీగా తమ వర్గీయులకు టిక్కెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. కరణం వర్గీయులకే బీఫాంలు అందాయనేది వాదన. దీంతో.. ఆమంచి వర్గీయులంతా రెబల్ గా బరిలో నిలిచారు. అయితే.. పార్టీ బీఫాం అందుకున్న కరణం వర్గీయుల్లో కేవలం 18 మంది మాత్రమే విజయం సాధించారు. ఆమంచి వర్గీయులు 14 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేశారు. దీంతో.. మేయర్ ఎన్నిక ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది.
అయితే.. ప్రస్తుతానికి ఉన్న నంబర్ ప్రకారం.. కరణం వర్గీయులకే మేయర్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. కానీ.. అధిష్టానం ఆమంచి వర్గానికి అనుకూలంగా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో.. తన వర్గానికి మేయర్ పదవి దక్కదేమోననే గుబులు కరణంలో మొదలైంది. అందుకే.. విపక్షాల మాదిరిగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అందుతున్న సమాచారం ప్రకారం.. తన వర్గీయులను హైదరాబాద్ తీసుకెల్లి సేఫ్ గా ఉంచారని తెలుస్తోంది.
అయితే.. మంత్రి బాలినేని చేసిన ప్రకటన కూడా కరణంలో గుబులు రేపుతోందని అంటున్నారు. గెలిచిన 32 మందీ పార్టీ కౌన్సిలర్లే అని చెప్పడం.. మేయర్ పదవిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో.. తనకు ఎక్కడ మొండి చేయి చూపిస్తారోనని ఆందోళనకు గురవుతున్నారట. ఈ విధంగా.. చీరాలలో మొత్తం స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. అధికార పార్టీలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుంది? మేయర్ పదవి ఏ వర్గానికి దక్కుతుంది? అన్నది చూడాలి.