అమరావతి రైతులు హర్ట్ : పోరాటాన్ని లైట్ తీస్కున్న పవన్

Update: 2022-11-28 08:58 GMT
అమరావతి రాజధాని రైతులు పోరాటం చేయలేదా అంటే చేశారు. ఎంతో బాగా చేశారు అని చెప్పారు. నిజానికి అమరావతి రాజధాని నిర్మిస్తామని ఆశలు కల్పించి వారి నుంచి వేలాది ఎకరాలు టీడీపీ సేకరించి తాము అధికారం నుంచి దిగిపోగానే అనుకున్న స్థాయిలో మద్దతు ఇవ్వకపోయిన 151 సీట్లో అధికారంలోకి వచ్చిన అత్యంత బలమైన ప్రభుత్వాన్ని అమరావతి రైతులు ఢీ కొట్టారు.

అంతకంటే జగన్ అనే సర్వశక్తిమంతుడు అయిన ముఖ్యమంత్రికి వారు ఎదురు నిలిచారు. అది కూడా ఆయన సీఎం గా  సీట్లో కూర్చున్న తొలి ఆరు నెలలోనే మొట్టమొదటిగా తామే వైసీపీని మీద గట్టిగా వ్యతిరేక స్వరం వినిపించారు. అమరావతి రాజధాని ఉండి తీరాలని వారు పట్టుపట్టారు. పంతం పట్టారు.

నిజానికి అమరావతి రైతులు పోరాటం ఆ తీరున చేయకపోతే ఈ పాటికి మూడు రాజధానులు అన్నది అమలులోకి వచ్చి ఉండేది. రాజకీయ పార్టీలు రైతుల పోరాట పటిమ చూసి మాత్రమే మద్దతు ఇచ్చాయి. అంతవరకూ ఎందుకు తెలుగుదేశం పార్టీ ముందుండి వారిని నడిపించాల్సింది దూకుడుగా నిలబడి సర్కార్ తో ఫైట్ చేయాల్సింది కానీ రైతులకు పుట్టినంత మంట వారికి లేదు అనే విమర్శలు వచ్చాయి.

దానికి కారణం టీడీపీకి రాజకీయం ముఖ్యం. మూడు రాజధానులు అంటూ వైసీపీ వేసిన చక్రబంధంలో ఆ పార్టీ చిక్కుకుని పోయింది. దాంతో వారు ఉత్తరాంధ్రా రాయలసీమను వదులుకోలేక మెత్తమెత్తగా ఉంటూ వచ్చారు. అలా చేయడంలో వైసీపీ సకెస్ అయింది. దాంతో రైతులకు తాము నమ్ముకున్న తెలుగుదేశం నుంచి ప్రత్యక్ష మద్దతు లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక్కడే తెలుగుదేశం రాజకీయ ఆరాటంతో పాటు అసమర్ధ నిర్వాకం కూడా కనిపిస్తాయి.

ఎలా అంటే అమరావతి రాజధాని ఏపీ మొత్తం ప్రజలకు సంబంధించి తాము ఎంపిక చేసి నిర్మించదలచాను అని గట్టిగా చెప్పి అయిదు కోట్ల మంది జనాలను ఒప్పించలేకపోయింది. ఆ విధంగా టీడీపీ వైఫల్యం తో రైతులు రోడ్డున పడ్డారు. అయినా సరే వారే తెగించి పోరాటం చేశారు. న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ తిరుపతి దాకా పాదయాత్ర చేసినా అమరావతి టూ అరసవెల్లి అంటూ పాదయాత్ర సగం దాకా చేసినా వారి ఉద్యమ కసి అందులో కనిపిస్తుంది.

అదే విధంగా న్యాయ స్థానాలలో పోరాడుతూ మీడియా ద్వారా తమ సమస్యను ఎప్పటికపుడు లైవ్ లో ఉంచుతూ రైతులు తమ శక్తికి మించి పోరాటం చేశారు. అందుకే వారు రాజ్యాంగబధ్ధమైన రక్షణను పొందారు. అమరావతే అసలైన రాజధాని అని హై కోర్టు తీర్పు ఇచ్చింది అంటే అది రైతుల విజయంగానే చూడాలి. అదే విధంగా దాదాపు వేయి రోజుల పాటు ఒక ప్రజా ఉద్యమం నడపడం చిన్న విషయం కాదు. వృద్ధులు ఆడవాళ్ళు అందరూ కూడా ఒక్కటిగా నిలిచి పోరాటం చేసి శభాష్ అనిపించుకున్నారు.

వైసీపీ మొత్తం పాలనలో ఏదైనా తీవ్ర అసంతృప్తి ఉంది అనుకుంటే మొదటి స్థానంలో అమరావతి రాజధాని విషయంలో తాము ఓడామన్నదే అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు రైతులను ప్రభుత్వం చర్చలకు పిలిచినా వెళ్లకుండా తాము ఎలా సాధించుకోవాలో అవే దారులలో వారు వెళ్లి ఈ రోజుకు ఏకైక రాజధాని అమరావతి అని నిరూపించుకున్నారు.

అటువంటి అమరావతి రైతుల పోరాటాన్ని పవన్ లైట్ తీసుకోవడం తప్పు అనే అంటున్నారు. అమరావతి తో పోలిస్తే ఇప్పటం లో ప్రజలు ఏమి పోరాటం చేశారో పవనే చెప్పాలని అంటున్నారు. ఇప్పటంలో పవన్ లాంటి రాజకీయ నేత మద్దతు దక్కించుకోవడమే వారు సాధించిన ఘనత అనుకుంటే అమరావతి రైతులు ఏ అండా దండా లేకుండానే ఇంతదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

అందువల్ల వారిని అభినందించి తీరాల్సి ఉంది. అదే టైం లో వారికి సరైన మద్దతు ఇవ్వని రాజకీయ నాయకత్వం తమను తాము నిందించుకోవాల్సి కూడా ఉంది. అదే విధంగా అయిదు కోట్ల మందికి అమరావతి రాజధాని అని చెప్పి జనాలను ఒప్పించలేని రాజకీయ పార్టీలు తామే ఓడిపోయాని కూడా చెప్పుకోవాలి. అంతే తప్ప అమరావతి రైతుల పోరాటం ఏ విధంగానూ ఇప్పటంతో పోల్చడానికి కుదిరే వ్యవహారం కాదు.

ఇంకా చెప్పాలీ అంటే జాతీయ స్థాయిలో కూడా కొన్ని ప్రజా ఉద్యమాలు జరిగాయి. కానీ అమరావతి రైతులు చేసిన ఉద్యమాలు వాటి కోవలోకే చెందుతాయి అని అంటున్నారు. అలా రైతులు తమ జీవితాలను ఫణంగా పెట్టి మరీ పోలీసు లాఠీ దెబ్బఓకు ఒనర్చి చేస్తున్న పోరాటం మీద పవన్ ఏమి ఉద్దేశ్యంతో చేశారో కానీ ఇప్పటంతో పోల్చి చూడడం మాత్రం తప్పు అనే అంటున్నారు.

అదే విధంగా ఇప్పటం ప్రజలు కొందరు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుని తప్పు దోవ పట్టించి స్టేలు తెచ్చుకుని చివరికి చీవాట్లు తిన్నారు. లక్ష రూపాయలు వంతున పద్నాలుగు మంది కోర్టుకు జరీమానా కూడా కట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. అదే అమరావతి రైతులు తమ పోరాటం ద్వారా న్యాయ స్థానాల్లో విజయం సాధించారు. ఇవన్నీ కళ్ల ముందు ఉన్న విషయాలు, నిజాలు, మరి అన్నీ తెలిసే పవన్ ఇప్పటంతో అమరావతిని పోల్చారా అన్నదే పెద్ద డౌట్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News