ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వైఖరి భారతీయుల మనసుల్ని గాయపర్చింది. భారత జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్ గా రూపొందించిన వస్తువుల్ని అమెజాన్ కెనడాలో తన స్టోర్ లో అమ్మకానికి పెట్టటం.. దీనిపై పలువురు ఫిర్యాదు చేసినా లైట్ తీసుకోవటం తెలిసిందే. ఈ దారుణం గురించి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ తో ఫిర్యాదు చేశారు.
దేశాన్ని అవమానించేలా అమెజాన్ ప్రవర్తన ఉందని.. తన సైట్లో ఉంచిన త్రివర్ణ పతాకాలతోకూడిన డోర్ మ్యాట్లను వెంటనే రిమూవ్ చేయాలన్న డిమాండ్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన ఆమె.. భారతీయుల్ని అవమానించేలా వస్తువుల్ని విక్రయిస్తే.. అమెజాన్ సంస్థ ఉద్యోగులకు వీసాలు ఇచ్చేది లేదని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
ట్వీట్ తో సుష్మ ఇచ్చిన వార్నింగ్ కు అమెజాన్ కు పట్టిన నిర్లక్ష్యం మత్తు వదిలింది. వెంటనే.. చేసిన తప్పునకు పడే శిక్ష చాలా ఖరీదైందన్న విషయాన్ని గుర్తించిన సంస్థ.. త్రివర్ణ పతాకం మోడల్ లో తయారుచేసిన డోర్ మ్యాట్ ప్రొడక్ట్స్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకపక్క ట్వీట్ తో వార్నింగ్ ఇవ్వటంతో పాటు.. మరోవైపు కెనడాలోని భారత దౌత్య అధికారులతో మాట్లాడి.. అమెజాన్ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆదేశాలుఅందే లోపే.. వార్నింగ్ లోని తీవ్రతను గుర్తించిన అమెజాన్.. వివాదాస్పద వస్తువుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/