ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజంగా అంబానీ కుటుంబం ఏది చేసినా వార్తగానే నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలను ఆయన వెల్లడించారు. తాను అత్యంత ధనవంతుడైనా చేతిలో చిల్లి గవ్వ ఉండదని తెలిపారు. అంతేకాదు ఏ రకమైన ఏటీఎం కార్డులను వాడనని స్పష్టం చేశారు. ఇంతవరకు ఆయన క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవని తెలిపారు.
ప్రపంచ కుబేరుడైనా తన జేబులో చిల్లి గవ్వ ఉండదని చెప్పడం నిజానికి చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఆయన బయటకు వెళ్లినప్పుడు ఎలా అనుకుంటున్నారా? ఏం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా పటిష్ఠ బందోబస్తు ఉంటుంది. కొంతమంది సిబ్బంది ఆయనతోనే ఎల్లప్పుడూ ఉంటారు. ఏ అవసరమైనా వారే చూసుకుంటారని చెప్పారు. అందుకే అంబానీకి డబ్బులు, కార్డులతో పని ఉండదని చెబుతున్నారు.
ఆయనకు రోడ్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తే కాసేపు అక్కడ ఉంటానని చెప్పారు. నచ్చిన ఫుడ్ ఉంటే రోడ్ పక్కన అయినా ఆగి తింటానని వెల్లడించారు. ప్రపంచ కుబేరుడైన ఆయన ఏది చేసినా అతి పెద్ద విశేషమే కదా.
మనదేశంలోనే ఈయన అత్యంత ధనవంతుడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. ముకేశ్ సంపాదన కేవలం ఒక్కరోజులోనే రూ.100 కోట్లు పెరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈయనతో పాటు కుటుంబమంతా అతి విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు. అంబానీ ఇంట్లో ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లు, వస్తువులు ఉంటాయి.