దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో యావత్ దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇండియా లో ఉన్న పరిస్థితులని చూసి ప్రపంచ దేశాలు కూడా చలించిపోయ ఎంతో మంది దాతలు దేశానికి మద్దతుగా తమకు తోచినంత సాయం చేసి కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే రిలయన్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సెకండ్ వేవ్ లోనూ రిలయన్స్ ముందుకొచ్చింది. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో 1000 పడకలలతో ఆస్పత్రి ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.
గుజరాత్ లోని జామ్ నగర్ లోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు కేవలం వారంలోనే 400 పడకలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. వేరోచోట మరో 2 వారాల్లోనే 600 పడకలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ వెయ్యి పడకలకు అవసరమైన మ్యాన్ పవర్, మెడికల్ సపోర్ట్, ఇతర పరికరాలు, డిస్పోజల్ వస్తువులు అన్నింటినీ తమ కంపెనీనే సమకూర్చుతోందని రిలయన్స్ తెలిపింది. కరోనా సెకండ్ సమయంలో అందరికీ సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం అదనపు ఆరోగ్య సేవలు ఎంతైనా అవసరం. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆక్సీజన్ సదుపాయతో పాటు 1000 వెయ్యి పడకలు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం. మరో వారం రోజుల్లో 400 పడకలు సిద్ధమవుతాయి. మరో రెండు వారాల్లో మిగిలిన 600 బెడ్స్ ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ అందరికీ ఉచితంగానే కరోనా చికిత్స అందిస్తున్నాం. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మన భారతీయులకు రిలయన్స్ వీలైనంత సాయం చేస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం అందరం కలిసి ఈ కరోనా పోరాటంలో విజయం సాధిస్తాం అని నీతా అంబానీ అన్నారు. గుజరాత్‌లోనే కాకుండా ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది. ముంబైలో 875 పడకలతో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.