ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. విశాఖలో 6వేల ఎకరాల్లో భూ కుంభకోణం జరుగుతోంది, భూముల రికార్డులు మార్చేసి వేలకోట్లు కాజేసే పరిస్థితికి అధికారులు, పోలీసులు వస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్ లేదని అంబటి ఎద్దేవా చేశారు. మాట్లాడడమే సరిగా రాని వ్యక్తి వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు, మొద్దబ్బాయి, పనికిమాలిన వ్యక్తి అని గూగుల్ లో కొట్టినా చెబుతుందని చలోక్తులు విసిరారు. లోకేష్ సేవ చేయడం కోసం వచ్చాడో, వాళ్ల నాయన సూట్ కేసులు మోయడానికి వచ్చాడో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అంబటి తెలిపారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమని, అభివృద్ధికి కాదని అంబటి స్పష్టం చేశారు. లోకేష్ వేల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ వేయాలని తాము సవాల్ చేసి 24 గంటలైనా...చంద్రబాబు, ఆయన పుత్రరత్నం దాన్ని స్వీకరించకుండా పారిపోతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ మాట్లాడుతున్నారని, చర్చ కాదని ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలు తెలుస్తాయన్నారు. లోకేష్ కు దమ్ము, ధైర్యం ఉంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. పరిటాల రవి హత్య కేసు, ఔటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్ లో స్కాంలు జరిగాయంటూ చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ కోరితే... విచారణకు ఆదేశించి నిగ్గుతేల్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు , ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంక్వైరీ వేసే దమ్ము, ధైర్యం లేక ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని చంద్రబాబును అంబటి సూటిగా ప్రశ్నించారు.
మహానాడులో లోకేష్ మైక్ దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు మొహం వాడిపోయిందని అంబటి ఎద్దేవా చేశారు. పుత్రరత్నం ఏం మాట్లాడతాడేమోనన్న భయం బాబులో కన్పించిందన్నారు. బిడ్డ పుట్టగానే పుత్రోత్సాహం రాదని, ప్రజలు మెచ్చుకున్నప్పుడో పుత్రోత్సాహం వస్తుందని బాబుకు చురక అంటించారు. పోలీసులే సెటిల్ మెంట్లు చేస్తున్నారని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరుడు అయ్యన్నపాత్రుడే చెబుతుంటే...ఇంకా ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని చంద్రబాబు సర్కార్ పై అంబటి నిప్పులు చెరిగారు. మహానాడులో చంద్రబాబు మాటలన్నీ శుద్ధ అబద్ధాలని, పసలేని మహానాడు అని అంబటి రాంబాబు తూర్పారబట్టారు. నటవారసుడిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ను భూస్థాపితం చేసిన చంద్రబాబు...మహానాడులో ఆయన గురించి గొప్పలు చెబుతుంటే వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ పంచలూడదీసి, చొక్కాలు చించి, చెప్పులు వేసి, ఆయన కుటుంబాన్ని చీల్చి, ముఖ్యమంత్రి పీఠం నుంచి బాబు గెంటేసి ఏకాకాని చేస్తే మానసిక క్షోభతో ఆయన చనిపోయారన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారని అంబటి తెలిపారు. అలాంటి వ్యక్తి నీతులు చెప్పడం వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/