క‌రోనాపై చైనాను ఇరికించేలా అమెరికా ప‌రిశోధ‌న‌లు

Update: 2020-04-17 09:41 GMT
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి అడుగుపెట్టి ప్రాంతం క‌మ్యూనిస్టు దేశం చైనాలో. ఆ దేశంలోని వ్యూహ‌న్ ప్రాంతంలో మొద‌టి క‌రోనా కేసు వెలుగుచూసింది. ఆ వైర‌స్ దావానంలా వ్యాప్తి చెంది ఏకంగా ప్ర‌పంచాన్ని చుట్టుముట్టేసింది. అయితే ఆ వైర‌స్‌ ను పుట్టించింది.. పెంచి పోషించింది చైనా అని - ఆ వైర‌స్‌ ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌పంచంపై వ‌దిలింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట‌. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్‌ ను చైనా వైర‌స్ అని కూడా అంటున్నారు. ఈ వైర‌స్ విష‌యంలో అమెరికా - చైనాలు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఆ మ‌హ‌మ్మారికి చైనానే కార‌ణ‌మ‌ని స్వ‌యంగా ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో దాన్ని రుజువు చేసేందుకు అమెరికాలో ప‌రిశోధ‌న‌లు ముమ్మ‌రం చేస్తున్నారంట‌.

ఆ ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక కార‌ణం కూడా ఉంది. ఎందుకంటే క‌రోనా వైర‌స్ మూలాల‌ను ప్ర‌పంచ దేశాల‌కు చైనా అందించ‌డం లేదు. పోని క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు మీరు ఏం చేశారో.. ఎలా అరిక‌ట్టారో స‌మాచారం ఇవ్వాల‌ని ప‌లు దేశాలు కోర‌గా చైనా మాత్రం స్పందించ‌కుండా ఎలాంటి వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేదు. దీంతో అమెరికా క‌రోనా వైర‌స్ విష‌యంలో విస్తృత ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. క‌రోనా మూలాల‌పై అమెరికా రంగంలోకి దిగి ప‌రిశోధ‌న‌ల‌ను ముమ్మ‌రం చేసింది. చైనాలోని వ్యూహ‌న్ ప్రాంతంలో ఉన్న మాంసం మార్కెట్ నుంచి కాకుండా గ‌బ్బిలాల‌పై ప‌రిశోధ‌న చేస్తున్న ల్యాబ్ నుంచి ఆ వైర‌స్ లీక్ అయ్యింద‌ని అమెరికా భావిస్తోంది.

2013లో గ‌బ్బిలాల్లో  గుర్తించిన డీఎన్ ఏ - ఆర్ ఎన్ ఏల‌కు ఇప్ప‌టి క‌రోనా వైర‌స్ అత్యంత స‌మీపంలో ఉంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో అమెరికా గుర్తించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెల‌ప‌డంతో దీనిపై చైనా అభ్యంత‌రం చెబుతోంది. శాస్త్రీయ ఆధారం లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డింది. అయితే ఇదే అంశంపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని అమెరికా ఆదేశించింది. దీంతో చైనా - అమెరికా మ‌ధ్య క‌రోనా వైర‌స్ చిచ్చు రేపుతోంది.



Tags:    

Similar News