లాడెన్ కొడుకు ఆచూకీ చెబితే అమెరికా భారీ ఆఫ‌ర్

Update: 2019-03-01 05:11 GMT
ఉగ్ర‌వాదంపై పోరు చేస్తున్న అమెరికా.. తాజాగా ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో భాగంగా అంత‌ర్జాతీయ తీవ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే మిలియ‌న్ డాల‌ర్ల రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

లాడెన్ కొడుకు పాక్ లో కానీ.. అప్ఘనిస్తాన్.. లేదంటే ఇరాక్ ల‌లో ఉండొచ్చ‌ని అమెరికా భావిస్తోంది. ఈ మూడు దేశాల్లో ఎక్క‌డైనా లాడెన్ కొడుకు ఉండొచ్చ‌ని.. అత‌న్ని ప‌ట్టి ఇచ్చినా.. అత‌ని ఆచూకీ చెప్పినా మిలియ‌న్ డాల‌ర్ల రివార్డును ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ మైకేల్ ఇవ‌నాఫ్ పేర్కొన్నారు.

లాడె న్ ను అమెరికా ద‌ళాలు హ‌త‌మార్చిన త‌ర్వాత ఆయ‌న కుమారుడు అల్ ఖైదా నాయ‌కుడు అయ్యారు. అత‌నికి సంబంధించిన ఆడియో.. వీడియోల‌లో ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో పెట్టారు. అత‌గాడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న అమెరికా.. తాజాగా భారీ రివార్డు మొత్తాన్ని అత‌ని ఆచూకీ కోసం ప్ర‌క‌టించింది. మ‌రి.. దీనికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌న్న‌ది కాల‌మే స‌మాధానం చెప్ప‌గ‌ల‌దు.
Tags:    

Similar News