మోడీని ఆ ప్ర‌శ్న అడిగి న‌వ్వుల‌పాలైంది

Update: 2017-06-02 14:54 GMT
ఒక దేశాధినేత‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌టం అంత తేలిగ్గా వ‌చ్చే అవ‌కాశం కాదు. అందునా.. ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన నేత‌ల్లో ఒక‌రిగా మారిన న‌రేంద్ర మోడీ లాంటి నేత‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నారంటే ఎంతో క‌స‌ర‌త్తు... మ‌రెంతో ఇన్ఫ‌ర్మేష‌న్ తో సిద్ధంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. అదేమీ చేయ‌కుండా.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఒక యువ మ‌హిళా జ‌ర్న‌లిస్టు త‌న ప‌రువును తానే పోగొట్టుకోవ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

అదే స‌మ‌యంలో మోడీ ఎంత జాగ‌రూక‌త‌తో ఉంటారు? ఎంత అప్డేట్ గా ఉంటార‌న్న విష‌యాన్ని తాజా ఉదంతం  స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి. అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే.. త‌న తాజా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోడీ ర‌ష్యా వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పుతిన్ తో పాటు మోడీని నేష‌న‌ల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ మ‌హిళా జ‌ర్న‌లిస్టు మెగ‌న్ కెల్లీ ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశాన్ని పొందారు.

దీనికి ముందు.. కొన్ స్టాన్ టిన్ ప్యాలెస్ లో పుతిన్ ను క‌లిసిన కెల్లీ.. మోడీతో క‌ర‌చాల‌నం చేశారు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చే స‌మ‌యంలో మీ ట్వీట్ చూశాను.. గొడుగు ప‌ట్టుకొని ఉన్న ఫోటోను చూశాను అంటూ ఆమె ట్విట్ట‌ర్ లోని స్టేట‌స్ ను చెప్పారు మోడీ.

ఒక‌దేశ ప్ర‌ధాని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ చూశార‌న్న ఆనందం కావొచ్చు.. ఆమె లేటెస్ట్ గా చేసిన ట్వీట్ గురించి అంత వివ‌రంగా చెప్పటం షాకింగ్ గా మారిందేమో కానీ.. ఒక్క‌సారిగా ఆమె బ్యాలెన్స్ మిస్ అయ్యారు. నిజంగానా.. మీరు ట్విట్ట‌ర్‌ లో ఉన్నారా? అంటూ వేసిన ఎదురుప్ర‌శ్న‌కు.. స‌మాధానంగా మోడీ చిరున‌వ్వు న‌వ్వారు.

ఆమె నోటి నుంచి వ‌చ్చిన మాట‌తో కెల్లీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం భారీగా జ‌రిగిపోయింది. ఇంట‌ర్వ్యూ చేసే ముందు.. స‌ద‌రు దేశాధినేత క‌నీస వివ‌రాలు కూడా తెలుసుకోవా? ప‌్ర‌పంచంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న దేశాధినేత‌ల్లో టాప్ ఫైవ్ లో ఉన్న దేశాధినేత‌ను  ప‌ట్టుకొని మీరు ట్విట్ట‌ర్‌లో ఉన్నారా? అని ప్ర‌శ్నిస్తావా? ఏమాత్రం క‌స‌ర‌త్తు లేకుండా ఇంట‌ర్వ్యూలు చేయ‌టానికి ఎలా వ‌స్తారు? అంటూ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తూ.. ట్వీట్ల తిట్ల దండ‌కాన్ని అందుకున్నారు నెటిజ‌న్లు. ఏమైనా ఒక దేశాధినేత‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌టానికి వెళ్లే ముందు వాళ్లేంటి? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వారి  బ‌లాలు.. బ‌ల‌హీన‌తులు.. లోపాలు. ఆరోప‌ణ‌లు.. విమర్శ‌లు లాంటివి అధ్య‌య‌నం చేయ‌కుండా వెళితే.. ఇలాంటి న‌ష్ట‌మే వాటిల్లుతుంది మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News