ఆంధ్రోళ్లు మొనగాళ్లు. తెలివైనోళ్లు. ఎక్కడైనా నెగ్గుకురాగలరు. ఎవరినైనా తమ దారికి తెచ్చుకోగలరు. వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రోళ్ల గురించి.. వారి గొప్పతనం గురించి టన్నుల టన్నుల గొప్పలు చెప్పేస్తుంటారు. మరి.. అంత తెలివైనోళ్లు విభజన విషయంలో అంతలా ఎలా నష్టపోయారు బాస్? అని అడిగితే సమాధానం ఉండదు.
విడిపోతామన్నది ఎవరు? తెలంగాణ వారు. మరి.. విడిపోతామన్నోళ్లు త్యాగానికి సిద్ధమై.. దేనినైనా వదులుకోవాలి కానీ.. అందుకు భిన్నంగా ఆంధ్రోళ్లు అన్ని వదిలేసుకొని నష్టపోవటం ఏమిటన్న ప్రశ్నను సంధిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజానికి.. ఈ ప్రశ్నలోనే ఆంధ్రోళ్ల తెలివి పేరుతో జరిగే ప్రచారానికి.. వాస్తవానికి మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే తెలిసిపోయే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకూ లాబీయింగ్ చేయటంలో.. ఢిల్లీ మీద ఒత్తిడి తేవటంలో.. పావులు కదిపే విషయంలో తెలుగోళ్లలో తోపులైన ఆంధ్రోళ్ల తర్వాతే ఎవరైనా అన్న ప్రచారం ఉండేది. కానీ.. అందరిని తమవైపునకు తిప్పుకొని.. ఆంధ్రా గురించి ఎవరూ ఆలోచించకుండా.. వారికి జరిగే నష్టం గురించి ఎలాంటి ప్రచారం రాకుండా చేయటంతో పాటు.. తాము కోరుకున్నవి తమకు సొంతమయ్యేలా చేయటంలో తెలంగాణ ఉద్యమ నేతలు వేసిన ప్లాన్ కు ఆంధ్రోళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి కాలేదు. ఆంధ్రోళ్ల తెలివితక్కువతనాన్ని కాంగ్రెస్ ఒక రకంగా వాడేస్తే.. బీజేపీ మరోలా వాడేసింది. మోడీ బొమ్మను చూపించి.. ఆయన కానీ ప్రధాని అయితే ఏపీ మొత్తంగా బాగుపడిపోతుందన్న మాటతో పాటు.. తొక్కలోది ఢిల్లీ ఏముంది? దానమ్మ మొగుడి మాదిరి రాజధాని నగరాన్ని మేం నిర్మిస్తామంటూ కమలనాథులు నమ్మబలికితే ఓట్లేసి గెలిపించిన ఆంధ్రోళ్లకు ఎంతలా హ్యాండివ్వొచ్చన్న విషయాన్ని దేశ ప్రజలందరికి అర్థమయ్యేలా చేశారు మోడీ.
తాను నమ్మిన వారి సంగతి తర్వాత.. తనను మాత్రమే నమ్మకున్నవారిని సైతం నట్టేట ముంచే బాపతు మోడీ అన్న విషయాన్ని ఆంధ్రోళ్లకు అర్థమయ్యేలా చేయటమే కాదు.. తప్పు మాది కాదంటూ వితండ వాదన చేయటంలో బీజేపీ నేతల తర్వాతే ఎవరైనా. మరి.. అలాంటి బీజేపీ నేతల విషయంలో ఆంద్రోళ్లు ఎలా వ్యవహరించాలి. సొంత రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించలేని వెన్నుముక లేని నేతల కారణంగా బీజేపీలో ఆంధ్రోళ్ల ప్రయోజనాల మీద చర్చ జరిగే ఛాన్స్ లేదు.
ఇలాంటివేళ.. ఆంధ్రోళ్ల పౌరుషం.. రోషం.. వారు కోపం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని మోడీ బ్యాచ్ లకు అర్థమయ్యేలా చేయాలంటే ఏం చేయాలి? అన్నది ప్రశ్న. కత్తులు తిప్పటం.. కర్రలు పట్టుకొని రోడ్డు పడటం.. రోడ్ల మీద గంటల తరబడి నిరసన చేస్తూ.. పోలీసుల ఛీత్కారాలకు గురి కావాల్సిన అవసరమే లేదు. సింఫుల్ గా బీజేపీ నేతల సభలకు.. సమావేశాలకు ఒక్కరంటే ఒక్క ఆంధ్రోడు వెళ్లకుంటే సరి. నేతలు.. వారి అనుచరగణం తప్పించి మిగిలిన వారెవరూ హాజరు కాకుంటే అంతకు మించి షాక్ మరొకటి ఉండదు.
ఆంధ్రోళ్లలో లేనిది ఏమైనా ఉందంటే అది ఐక్యమత్యంగా పలువురు ఎటకారం చేస్తుంటారు. అలాంటి వారంతా షాక్ తో నోట మాట రానట్లుగా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రజల మీద ఉంది. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రాకి వస్తున్నారు. ఇలాంటి వేళ.. హోదా మీద మోడీ సర్కారు హ్యాండిచ్చిన వేళ.. అదే రీతిలో ఆంధ్రోళ్లు కూడా షా సభలకు గైర్హాజరు కావటం ద్వారా ఆంధ్రోళ్లు తమ సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి.. ఆంధ్రోళ్లు ఆ పని చేస్తారంటారా?