2014 ఫలితాల కంటే తిరుగులేని ఆధిక్యంతో మరో తన ఛరిష్మాతో మ్యాజిక్ చేసి విన్ మ్యూజిక్ వినిపించారు.. మోడీ - అమిత్ షా ద్వయం.. బిజెపి అధికారంలోకి రావడానికి మోడీ హవా ఎంతగా ప్రభావం చూపిందో.. అలాగే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలూ విజయానికి బాటలు వేసింది.. గత ఎన్నికల నుంచి విన్ విన్ టీంగా గుర్తింపు పొందిన వీరిద్దరి ద్వయం ఈ సారి క్యాబినెట్ లో కనిపించబోతోంది.. ఎందుకంటే గత ఐదేళ్లు అమిత్ షా పార్టీ పటిష్టతపైనే దృష్టి పెట్టారు.. రెండు సార్లు క్యాబినెట్ లోకి రావాలని రాజస్థాన్ లేదా యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేస్తామని మోడీ ప్రతిపాదించినా.. అమిత్ షా దేశంలో అన్ని రాష్ట్రాలకు బిజెపి విస్తరించడమే లక్ష్యమంటూ మంత్రి పదవిని తిరస్కరించారు..
ఈ సారి ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి క్యాబినెట్ లో హోం మంత్రి పదవి దక్కించుకున్నారు అమిత్ షా.. ఇక నెంబర్ 2గా మోడీ తర్వాత క్యాబినెట్ లో తన ప్రభావాన్ని చూపబోతున్నారంటున్నారు.. అయితే అధ్యక్షుడిగా సూపర్ సక్సెస్ ట్రాక్ ఉన్న అమితా షాను క్యాబినెట్ లోకి తీసుకురావడంపై కూడా పార్టీ క్యాడర్ లో చర్చకు దారి తీసింది.. అయితే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకునే ఆర్ ఎస్ ఎస్ సూచనల మేరకు అమిత్ షాను క్యాబినెట్ లో నెంబర్ 2 గా హోం మంత్రిగా ప్రోజెక్ట్ చేశారని ఢిల్లీ వర్గాల సమాచారం..
ప్రస్తుతం అమిత్ షా వయసు 55 సంవత్సరాలు.. మోడీ వయసు 68 సంవత్సరాలు మోడీ మరి అయితే వయసు రీత్యా ఈ టర్మ్ కాకుండా మరో టర్మ్ పనిచేసే అవకాశ ఉంది.. అమిత్ షా కు ఇంకా వయసు ఉండటం.. నెంబర్ 2గా హోం మంత్రిగా పాలనపై పట్టు సాధించడంతో పాటు మోడీతో ఉన్న మైండ్ సెట్ మేనేజ్ మెంట్ కారణంగా సరైన సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే .. దీని వల్ల అనుభవం పెరుగుతుందని.. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అమరిక జరిగిందని బిజెపి వర్గాలంటున్నాయి...