భారతీయ జనతా పార్టీ వెటరన్ పొలిటీషియన్లను బుజ్జగించే పనిలో పడ్డారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వరసగా వారితో సమావేశం అవుతూ.. వారిని బుజ్జగిస్తున్నారాయన. గత కొన్నాళ్లుగా బీజేపీలో పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రత్యేకించి వెటరన్లను పక్కన పెట్టేస్తూ ఉన్నారు.
బీజేపీకి పునాదులు వేసిన అద్వానీనే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనీయలేదు. ఆయన ఎంపీగా ఉన్నా ఇటీవలంతా ఆయనకు వీసవెత్తు విలువ ఇవ్వలేదు. ప్రధాని కావాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయారు అద్వానీ. ఆయన బయట పడలేక.. మోడీ వెంట నడవలేక సతమతం అయ్యారు. ఇక తొంబై యేళ్ల వయసును దాటేసిన అద్వానీకి రాష్ట్రపతి గుర్తింపును అయినా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు.
ఈ ఎన్నికల్లో ఆయనను పోటీనే చేయనివ్వడం లేదు. అలా రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇక కేవలం అద్వానీనే కాదు. మురళీ మనోహర్ జోషీ కూడా ఈ సారి నో టికెట్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిస్థితి కూడా అంతే! ఇక తను తప్పుకుంటున్నట్టుగా ఉమా భారతి ప్రకటించింది.
ఇలా ముఖ్య నేతలందరినీ పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఇది సహజంగానే పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. వారి ప్రభావం ఎంత అనేది పక్కన పెడితే వారు అలిగారనే విషయం మీడియా కూడా హైలెట్ చేస్తూ ఉంది.
ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా డ్యామేజ్ కంట్రోల్ కు దిగినట్టుగా ఉన్నాడు. అందుకే ఆయన వరసగా వారితో సమావేశాలు జరుపుతూ ఉన్నారు.
ముందుగా అద్వానీ వద్దకు వెళ్లి వచ్చిన షా ఆ తర్వాత జోషి వద్దకు వెళ్లారు. మరి ఈ సమావేశాల ఫలితం ఏమిటంటే.. మూతిముడుపులే, సీనియర్లు షా మీద చాలా సీరియస్ గా ఉన్నారనే టాకే వినిపిస్తోంది!