చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బాగానే అర్థమవుతున్నట్లుండి. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరును ప్రతిఒక్కరూ తప్పు పట్టే పరిస్థితి. పార్లమెంటు తలుపులు మూసి.. లైవ్ టెలికాస్ట్ ను ఆపేసి మరీ.. మంది బలంతో తాను అనుకున్నట్లుగా నిర్ణయాన్ని అమలయ్యేలా చేశారు సోనియాగాంధీ. నాడు జరిగిన విభజనపై కోట్లాది మంది నిరసన వ్యక్తం చేసినా పట్టలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా కశ్మీర్ ఎపిసోడ్ సందర్భంగా ఏపీ విభజన అంశం తరచూ రావటం కనిపిస్తుంది. సోమవారం రాజ్యసభలో ఏపీ విభజనను ప్రస్తావించిన కశ్మీరీ నాయకుడు గులాం నబీ అజాద్ కు కడుపు నిండా చివాట్లు పెట్టేశారు. ఏపీ విభజన బిల్లును ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని.. గుర్తుకు చేసిన బీజేపీ నేతలు చేసిన ఘాటు వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏపీ విభజన చేసిన తీరును అమిత్ షా గుర్తుకు చేయటంతో గులాం నబీ అజాద్ మౌనం దాల్చారు.
తాజాగా ఈ రోజు (మంగళవారం) లోక్ సభలోనే జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి మాట్లాడుతూ.. కశ్మీర్ ను విభజించిన తీరు సరిగా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ పునర్విభజనపై ఏపీ అసెంబ్లీని సంప్రదించిన వైనాన్ని గుర్తు చేశారు. ఇదే తీరును కశ్మీర్ అసెంబ్లీని ఎందుకు సంప్రదించలేదన్న వైనాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాల ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం ఏకాభిప్రాయం మేరకు నడుచుకుందని.. బీజేపీ మాత్రం చట్టాల్ని దుర్వినియోగం చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు చెబుతున్న నీతి మాటలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ విభజన బిల్లుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చేసిన తీరుపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి క్లాస్ పీకినంత పని చేశారు. ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు కశ్మీర్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. దీంతో.. కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి నెలకొంది.