‘అభ్యాసవర్గ’ పేరుతో బీజేపీ ఎంపీలకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం భారతీయ జనతాపార్టీ నేతలకు కొత్త అంశాలు నేర్చుకోవడం కంటే...కొత్త టార్గెట్లు ఇచ్చేందుకు వేదికగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కామెంట్లు దీనికి తార్కాణంగా ఉన్నాయి. సిద్ధాంతం - భావజాలం కారణంగానే బీజేపీ నేడు ఈ స్థాయికి వచ్చిందని, కుటుంబ వారసత్వం వల్ల కాదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండాలని బీజేపీ ఎంపీలకు సూచించారు. అయితే, అమిత్ షా మాత్రం తెలంగాణ నేతలకు టార్గెట్ ఇచ్చారు.
ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ - పార్టీని - పార్టీ కార్యకర్తలను ఆయన తల్లి - కుమారుడితో పోల్చారు. కుమారుడికి వివాహమై - అతడు భార్యపై కొద్దిగా ఎక్కువ దృష్టిపెట్టినప్పుడు తల్లిలో కొద్దిగా అలక్ష్యానికి గురయ్యాననే భావన తలెత్తుతుందని చెప్పారు. కాబట్టి ఎంపీలుగా గెలిచిన తర్వాత పార్టీని - పార్టీ కార్యకర్తలను మర్చిపోవద్దని సూచించారు. ‘పార్టీ ఐడియాలజీ - ఆలోచనలే బీజేపీని ఇప్పుడీ స్థితికి చేర్చాయి. పార్టీ ఎదుగుదల వెనక కార్యకర్తల కృషి ఉంది తప్ప వారసత్వ రాజకీయాలో - ఏ ఒక్క కుటుంబమో లేదు. మన విజయం వెనకా ఉన్నది వారే. ఈ స్థాయికి చేర్చిన కార్యకర్తలను మరవొద్దు’ అంటూ ప్రధాని పార్టీ ఎంపీలకు సూచించారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న కార్పొరేషన్లు - మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలతో చరిత్ర సృష్టించాలని స్పష్టం చేశారు. ఎంపీలే తమ నియోజకవర్గాలకు పూర్తి బాధ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీల వైఖరిపై వస్తున్న ఆరోపణలపై షా సీరియస్ అయ్యారు. అధికారం చేపట్టామన్న పొగరుతో వ్యవహారించవద్దని - ప్రజలతో మమేకం కావాలని హితబోధ చేసినట్లు సమాచారం. ఎంపీలందరూ పార్లమెంట్ కు విధిగా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు.