ఆ విష‌యంలో మోడీని మించిపోయిన షా!

Update: 2019-06-06 07:26 GMT
కేంద్ర‌ప్ర‌భుత్వంలో ప‌లు కీల‌క అంశాల‌కు సంబంధించి కేబినెట్ క‌మిటీల్ని ఏర్పాటు చేసే విష‌యం తెలిసిందే. ఆర్థికాభివృద్ధి.. ఉద్యోగాల క‌ల్ప‌న‌తో పాటు భ‌ద్ర‌త తదిత‌ర అంశాల‌కు సంబంధించి కేంద్రం ప‌లు క‌మిటీల్ని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీల్లో అత్య‌ధికంగా కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాకు అమిత ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

మోడీ నీడ‌లా చెప్పే అమిత్ షాను.. అన్నింటా క‌మ్మేసేలా తాజా నిర్ణ‌యాలు ఉంటున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన క‌మిటీల్లో అన్నింటిలోనూ షాకు ప్రాతినిధ్యం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం విశేషం. మొత్తం 8 మంత్రివ‌ర్గ సంఘాలు ఏర్పాటు చేయ‌గా.. అన్నింటిలోనూ షాకు చోటు క‌ల్పించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. షా కంటే త‌క్కువ‌గా మోడీకి క‌మిటీల్లో ప్రాధాన్య‌త క‌ల్పించ‌టం. అమిత్ షాకు 8 క‌మిటీల్లో స్థానం క‌ల్పిస్తే.. ప్ర‌ధాని ఆరు స్థానాల్లో మాత్ర‌మే స్థానం క‌ల్పించారు. ఇక‌.. ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఏడు క‌మిటీల్లో.. ర‌క్ష‌న మంత్రి రాజ్ నాథ్ రెండు క‌మిటీల్లో చోటు క‌ల్పించారు. 

షా అధ్య‌క్షుడిగా ఉన్న రెండు క‌మిటీలు మిన‌హా మిగిలిన ఆరింటిలోనూ మోడీ ఉన్నారు. నియామ‌కాల‌కు సంబంధించిన అంశం మిన‌హా అన్నింటిలోనూ నిర్మ‌లా సీతారామ‌న్ కు చోటిచ్చారు. తాజా ఎపిసోడ్ చూస్తే కేంద్రంలో అమిత్ షా ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న విష‌యం తాజా నియామ‌కాల్ని చూస్తే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News