బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆనందం ఒక్కరోజులోనే ఆవిరయ్యే పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి కష్టకాలం ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వేసిన కొత్త స్కెచ్ కాస్త ఒక్క రోజులోనే విఫల ప్రయోగంగా తేలిపోయింది. ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో కుంగిపోయిన బీజేపీలో ఉత్సాహం నింపేందుకు ఓ మెట్టుదిగి మరీ అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు బీజేపీయే అతిపెద్ద శత్రువు అని చెప్పిన శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కలిసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిసైడవడమే కాకుండా...నేరుగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అయితే ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అమిత్ షా అవాక్కయ్యే కామెంట్లు చేశారు.
2014లో కలిసి పోటీ చేసిన శివసేన అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పింది. బీజేపీతో తెగదెంపుల తర్వాత ఆ పార్టీని శివసేన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పాల్ ఘర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. పాల్ ఘర్ ఉప ఎన్నికల్లో శివసేనపై బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కూడా శివసేన ఆరోపించింది. తమకు రాజకీయాల్లో అతిపెద్ద శత్రువు బీజేపీనే అని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ మధ్యే అన్నారు. ఇలా ఇరు పార్టీల మధ్య పొరాపొచ్చాలు తీవ్రస్థాయిలో నెలకొన్న నేపథ్యంలో `సంపర్క్ ఫర్ సమర్థన్` కార్యక్రమంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి శివసేనాధిపతి ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసం మాతోశ్రీలో బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. థాకరేతో భేటీ అయిన అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడలేదు.
అయితే అమిత్ షాతో భేటీ విషయంపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాతో భేటీ అయినప్పటికీ...ఒంటరిగా పోటీ చేయాలనే శివసేన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. `అమిత్ షా అజెండా ఏమిటో మాకు తెలుసు. కానీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న శివసేన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదంటూ’ సంజయ్ స్పష్టం చేశారు. తమ సొంత నిర్ణయాన్ని ఇతరులు ఎలా ప్రభావితం చేస్తారని రౌత్ ఎదురు ప్రశ్నించారు.
కాగా, శివసేనాధిపతి ఉద్ధవ్ థాకరేతో అమిత్ షా భేటీకి కొన్ని గంటలముందే ఈ పార్టీ అధికార పత్రిక సామ్నాలో బుధవారం ప్రచురితమైన సంపాదకీయంలో విమర్శలు గుప్పించింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ - మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని శివసేన ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంపర్క్ ఫర్ సమర్థన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ - క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆ పార్టీ సంబంధాలను పూర్తిగా కోల్పోయిందని మండిపడింది. ``గత ఎన్నికల్లో(2014లో) ప్రధాని మోడీ వెంట ఉన్న మిత్రులు ఇప్పుడు ఎందుకు దూరమవుతున్నారు. దీనికి గల కారణాల్ని ఆయన అన్వేషించాలి. సామ-దాన-బేధ- దండోపాయాల్ని ప్రయోగించి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా 350 సీట్లు సాధించాలని మోడీ - అమిత్ షా ద్వయం కలలు కంటోంది. ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమితోనే అమిత్ షా దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు` అని శివసేన ఎద్దేవా చేసింది. దేశ ప్రజలతో బీజేపీకి సంబంధం (సంపర్క్) తెగిపోయిందని, అందుకే అమిత్ షా కొత్త ప్రచారానికి తెర లేపారని విమర్శించింది. తాజాగా ఆ పార్టీ నేత సైతం ఇదే కామెంట్లు చేయడం గమనార్హం.