బెదరగొట్టే అమిత్ షాను భయపెట్టింది..!

Update: 2019-08-11 07:51 GMT
అమిత్ షా.. ఇప్పుడు దేశంలో ప్రధాని నరేంద్రమోడీ తర్వాత అత్యంత బలవంతుడైన నేత. పైగా కేంద్ర హోంమంత్రి కూడా. అయితే అమిత్ షాను సైతం భయపెట్టే ఘటన ఒకటి చోటుచేసుకుంది. తాజాగా దాన్ని అమిత్ షా పంచుకున్నారు. ఇంతకీ అదేంటో తెలుసా.? అదే ‘ఆర్టికల్ 370’. అవును కేంద్రమంత్రిని భయపెట్టింది ఇదే..

2014 ఎన్నికల్లో అమిత్ షా పోటీచేయలేదు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా అయ్యి బీజేపీని చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మోడీతోపాటు అమిత్ షా బీజేపీ జోడు గుర్రాలై బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ రావడానికి తోడ్పాటునందించిన అమిత్ షాను ఏకంగా కేంద్ర హోంమంత్రిని చేశాడు ప్రధాని మోడీ. దీంతో దేశంలో అనాదిగా పట్టిపీడిస్తున్న సమస్యలపై అమిత్ షా యుద్ధం ప్రకటించారు. ఆ దిశగా కశ్మీర్ విభజన - ట్రిపుల్ తలాక్ బిల్లు సహా అన్నింటిని ఆమోదింప చేస్తున్నారు.

అయితే తొలి హోంమంత్రి కావడం.. తొలిసారి ఆర్టికల్ 370  - కశ్మీర్ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో ఆ భయం అమిత్ షాను వెంటాడిందట.. భయపడుతూనే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టానని.. కానీ రాజ్యసభ ఆమోదించడంతో తన బాధ - భయం తగ్గిపోయిందన్నారు. కీలకమైన తన తొలి బిల్లు ఆమోదంపై ఎన్నడూ లేనంతా భయాన్ని అనుభవించానని అమిత్ షా  మీడియాతో మాట్లాడుతూ చెన్నైలో స్పందించారు.


Tags:    

Similar News