నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి ఏ దేశం కూడా ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఎసి వెంబడి భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఈ కామెంట్స్ చేశారు.
1962 భారత్-చైనా యుద్ధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. చైనా దూతల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డబ్బును రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం ఖర్చు చేశారని విమర్శించారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యొక్క FCRA [విదేశీ కాంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం] రద్దుపై ప్రశ్నలను నివారించడానికి కాంగ్రెస్ పార్లమెంటులో సరిహద్దు సమస్యను లేవనెత్తిందని అమిత్ షా పార్లమెంట్ హౌస్ వెలుపల విలేకరులను ఉద్దేశించి అన్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF), చైనా రాయబార కార్యాలయం నుండి ₹ 1.35 కోట్లు పొందిందని ఆరోపించారు. ఇది ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల ప్రకారం లేనందున దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.
నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం దక్కకుండా పోయింది' అని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు.
భారత సైనికుల పరాక్రమాన్ని అమిత్ షా ప్రశంసించారు. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాని.. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ కబ్జా చేయలేరని అమిత్ షా అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.