పంజాబ్‌లో.. అమిత్ షా మంత్రం.. కాంగ్రెస్ ఖాళీ ఖాయం!

Update: 2021-10-27 10:07 GMT
రాజ‌కీయా ల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతాయ‌నే విష‌యం ఎవ‌రూ చెప్పలేరు. వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు.. ప్ర‌త్య‌ర్తుల‌ పై ప‌ట్టు సాధించేందుకు ఎత్తుగ‌డ‌లు.. ఇలా.. అనేక రూపాల్లో రాజ‌కీయాలు మారిపోతున్నాయి. విలువ‌లు.. నైతిక‌త అనేది పాత విష‌యం గా మారిపోయింది. ఇప్పుడు దేశ రాజ‌ధాని ఢిల్లీ ని ఆనుకుని ఉన్న పంజాబ్‌ లో నూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం సాగుతోంది. కాంగ్రెస్‌ కు ఇప్ప‌టి కే అడుగ‌డుగునా.. చెక్ పెడుతున్న బీజేపీ.. అనూహ్యం గా.. ఇప్పుడు స‌రికొత్త ఎత్తుగ‌డ‌ తో ముందుకు వ‌చ్చింది. త‌న చేతి కి మ‌ట్టి అంట‌కుండా.. కాంగ్రెస్‌ ను ప‌త‌నం దిశ‌ గా పంపించేలా వ్యూహాత్మ‌కం గా అడుగులు వేసింది.

కాంగ్రెస్కు రాజీనామా చేసిన పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన రాజకీయ భవిష్యత్తు పై కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ తో రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, గుర్తు పై త్వరలోనే వివరాలు తెలియజేస్తానని తెలిపారు. దీని పై ఇప్పటికే ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని సీట్ల లో పోటీ చేస్తామని చెప్పారు కెప్టెన్ పొత్తు కుదుర్చుకోవడం లేదంటే సొంతం గానే పోటీ చేస్తామని వివరించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ తాము బలం గా పోరాడతామని అన్నారు.

మరో వైపు, 25-30 మంది నేతల తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు కెప్టెన్ వెల్లడిం చారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల పై చర్చించేందుకు సమావేశమవుతున్నట్లు చెప్పుకొచ్చారు. "నేను సైనికుడి గా శిక్షణ తీసుకున్నా. సైన్యం లో పదేళ్ల పాటు పనిచేశా. శిక్షణ సమయం నుంచి.. ఆర్మీని వీడే వరకు నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి కనీస అంశాలు నాకు తెలుసు. మరో వైపు, పంజాబ్ హోంమంత్రి గా నేను 9.5 సంవత్సరాలు పనిచేశా. ఒక నెల హోం మంత్రి ఉన్న వ్యక్తి.. నాకంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పుకుంటున్నారు. కల్లోలిత పంజాబ్ ఎవరికీ అవసరం లేదు`` అని అమ‌ర్ అన్నారు.

అయితే.. ఇక్క‌డే ఒక కీల‌క విష‌యం చెప్పుకోవాలి. అమ‌రీంద‌ర్ నాయ‌కుడే.. సీనియ‌రే. ఈ విష‌యం లో ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇప్పుడు హ‌ఠాత్తుగా పార్టీ ఎందుకు పెడుతున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు అమిత్ షా మంత్రాంగం తోనే ఆయ‌న పార్టీ పెడుతున్నార‌నేది స్ప‌ష్టం గా క‌నిపిస్తున్న విష‌యం. ఎందుకంటే.. పంజాబ్‌ లో బీజేపీకి పెద్ద‌గా బ‌లం లేదు. అయితే.. సిక్కు ఓట‌ర్ల‌ ను ఆక‌ర్షించ‌గ‌ల శ‌క్తి.. అదే స‌మ‌యం లో త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని తీసుకువ‌చ్చి.. బీజేపీ కి  ఓటు వేయ‌మ‌ని అడిగినా.. ఎవ‌రూ వేయ‌రు.

ఈ ప‌రిణామాల‌ ను దృష్టి లో ఉన్న అమిత్‌షా.. వ్యూహాత్మ‌కం గా చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు. అమ‌రింద‌ర్‌ తో ప్ర‌త్యేకం గా పార్టీ పెట్టించి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ను . సిక్కుల ఓట్ల‌ను .. అమ‌రీంద‌ర్‌ కు ప‌డేలా చేయ‌డం లో ప్ర‌తిపాద‌న‌లు చేశారు. నెల రోజ‌లు కింద‌ట‌.. అమిత్‌షా ను క‌లిసిన‌ప్పుడే.. ఈ విష‌యం బ‌య‌ట‌ కు పొక్కినా.. ప్ర‌త్యేకం గా పార్టీ పెడ‌తార‌ని అనుకోలేదు. కానీ, ఇప్పుడు అమ‌ర్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వ్యూహం బ‌య‌ట ప‌డింది. ఏదేమైనా.. త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా.. కాంగ్రెస్‌ ను అంతం చేసే క్ర‌తువు లో అమిత్ షా వ్యూహం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News